సీమ చింతకాయ సత్తా తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..

మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు ప్ర‌తి రోజు త‌గిన మోతాదులో సీమ చింతకాయ‌లు తీసుకుంటే ర‌క్తంలో చెక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అతి ఆక‌లి త‌గ్గు ముఖం ప‌డుతుంది. దాంతో ఈజీగా వెయిట్ లాస్ కూడా అవుతారు.

సీమ చింతకాయ సత్తా తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..
Manila Tamarind
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 15, 2022 | 7:23 PM

సాధారణంగా చింతకాయ అంటే అందరికీ తెలిసిందే.. కానీ, సీమ చింతకాయలంటే ఎక్కువ మందికి సరిగా తెలియదు..కానీ, గ్రామాల్లోని ఉండేవారికి మాత్రం తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ సీమ చింతకాయలను సాంప్రదాయ వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. ఈ చింతకాయలు వాటి ప్రత్యేకమైన తీపి, పులుపు కలిగి ఉంటాయి. ఈ చింతకాయ పచ్చిగా ఉన్నప్పుడు తింటే వగరుగా ఉంటుంది. పక్వానికి వచ్చాక తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది దక్షిణ మెక్సికో, దక్షిణ అమెరికా మధ్య అమెరికాలకు చెందినది. అయితే, తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ సీమ చింతకాయ సత్తా తెలిస్తే మాత్రం మీరు తినకుండా ఉండలేరంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యానికి ఇది చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో సీమ చింత‌కాయ‌లు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. గులాబీ, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉండే ఈ సీమ చింత‌కాయ‌లు కాస్త తియ్య‌గా, కాస్త వ‌గ‌రు గా ఉంటాయి. కానీ, వీటిలో పోష‌కాలు మెండుగా ఉంటాయంటున్నారు. ఇందులో విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్, ప్రోటీన్స్‌, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక పోష‌కాలతో నిండి ఉంది.

సీమ చింత‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఒత్తిడి, డిప్రెష‌న్‌, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి. జ్ఞాపకశక్తి, మానసిక స్థితి ,ఏకాగ్రతను పెంచుతుంది. మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు ప్ర‌తి రోజు త‌గిన మోతాదులో సీమ చింతకాయ‌లు తీసుకుంటే ర‌క్తంలో చెక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అతి ఆక‌లి త‌గ్గు ముఖం ప‌డుతుంది. దాంతో ఈజీగా వెయిట్ లాస్ కూడా అవుతారు.

ఇవి కూడా చదవండి

డయేరియా సమస్యతో బాధపడే వాళ్లకు కూడా సీమ చింతకాయ బాగా ఉపయోగపడుతుంది. సీమ చింతకాయ లో ఉండే గుణాలు డయేరియా సమస్యను తగ్గిస్తాయి. దీనికోసం మీరు సీమ చింతకాయ కొమ్మను తీసుకుని మరిగించి ఆ నీళ్ళని తీసుకోండి. దీంతో డయేరియా సమస్య తగ్గిపోతుంది.

సీమ చింతకాయ జిడ్డుగల మాడుకు చికిత్స చేస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. నల్లటి మచ్చలను తొలగిస్తుంది. మొటిమలకు కూడా చికిత్స చేస్తుంది.

సీమ చింతకాయలు పంటి నొప్పి, చిగుళ్ల నొప్పి మరియు నోటి పూతలని నిర్వహించడానికి తోడ్పడతాయి, అలాగే యాంటీసెప్టిక్ గా కూడా పనిచేస్తాయి. ఈ చింతపండులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి కఫాన్ని తగ్గిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.