Viral Video: ‘ఏంటి బ్రో ఇలా చేశావ్’… నెట్టింట నవ్వుల పూయిస్తోన్న వెడ్డింగ్ వీడియో
ఇప్పుడు ఇంటర్నెట్‌లో హుషారు అంతా పెళ్లి వీడియోలదే. రోజుకో వీడియో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. పెళ్లి అంటే ఫోకస్ అంతా వధూవరులపై ఉంటుంది.
ఇప్పుడు ఇంటర్నెట్‌లో హుషారు అంతా పెళ్లి వీడియోలదే. రోజుకో వీడియో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. పెళ్లి అంటే ఫోకస్ అంతా వధూవరులపై ఉంటుంది. వారి ప్రతి మూమెంట్ రికార్డవుతోంది. ఈ క్రమంలోనే పలు రకాల క్యూట్ వీడియోలు, ఫన్నీ వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా మీ ముందుకు మరో ఫన్నీ వీడియోను తీసుకొచ్చాం. ఈ వీడియో చూసిన తర్వాత మీరు నవ్వును కంట్రోల్ చేసుకోలేరు. తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో వధూవరులు కొన్ని ఆచారాలు పాటించడం మీరు చూడవచ్చు. ఈ సమయంలో ఓ అతిథి వారిద్దర్నీ ఎత్తుకునేందుకు ప్రయత్నించాడు. ఎంత వేగంగా అయితే ఎత్తుకున్నాడో, అంతే వేగంగా కింద పడేశాడు. ఈ అనుకోని పరిణామంతో అక్కడున్నవారంతా నవ్వడం ప్రారంభించారు. ఈ వివాహా వేడుక వీడియోను నెటిజన్లు బాగా లైక్ చేస్తున్నాడు. అలాగే కామెంట్ల రూపంలో తమ స్పందనలు తెలియజేస్తున్నారు. ముందుగా సదరు వీడియోను వీక్షించండి.
View this post on Instagram
వధూవరులు ఒకరికొకరు దగ్గరగా నిలబడి ఉండటం వీడియోలో చూడవచ్చు. ఇంతలో ఓ వ్యక్తి వారిద్దరిని కలిపి ఎత్తేందుకు ప్రయత్నించాడు. వధువు గాలిలో లేచిన తర్వాత, ఆచారంలో భాగంగా ఆమె చేతిలో ఉన్న బియ్యాన్ని వెనక్కి విసిరివేసింది. కొత్త జంటను పైకి ఎత్తిన మూడవ వ్యక్తి అకస్మాత్తుగా వారిని వదిలివేసి వెనక్కి వెళ్లాడు. దీంతో నూతన వధూవరులు కిందపడిపోయారు. దీంతో అక్కడి ఉన్నవారు వారిని పైకి లేపడం మీరు వీడియోలో చూడవచ్చు. ఇప్పుడు ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. 9 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 51,000 మంది ఎక్కువమంది లైక్ చేశారు.
Also Read: భర్త ప్రాణంగా పెంచుకుంటున్న చేపను భార్య వేపుకుని తినేసింది.. ఎందుకంటే?
పార్క్‌లో సరదాగా వాకింగ్ చేసేందుకు వెళ్లిన మహిళ.. ఆ రోజుతో ఆమె సుడి తిరిగిపోయింది