AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

King Cobra: దాహంతో ఉన్న నాగుపాముకు నీళ్లు తాపిన బాలుడు.. వీడియో చూసి షాక్‌ అవుతోన్న నెటిజన్లు

ఈ ప్రపంచంలో పాములకు అస్సలు భయపడని వ్యక్తులు కొందరు ఉన్నారు. వారికి సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు నెట్టింట్లో దర్శనమిస్తుంటాయి. అలాంటి వీడియోనే మరొకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

King Cobra: దాహంతో ఉన్న నాగుపాముకు నీళ్లు తాపిన బాలుడు.. వీడియో చూసి షాక్‌ అవుతోన్న నెటిజన్లు
Cobra Snake
Basha Shek
|

Updated on: Oct 16, 2022 | 4:59 PM

Share

పాములు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జీవులలో ఒకటిగా పరిగణిస్తారు. అయితే, అన్ని పాములు ప్రమాదకరమైనవి కావు. ప్రపంచంలో 2 వేలకు పైగా జాతుల పాములు నివసిస్తున్నప్పటికీ, వీటిలో కొన్ని జాతులు మాత్రమే విషపూరితమైనవి. కింగ్‌ కోబ్రా లాంటి కొన్ని పాములు చాలా మరీ విషపూరితమైనవి. అవి తమ విషంతో మనుషులను ఒక్క క్షణంలో చంపగలవు. అందుకే ప్రజలు పాములకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే ఈ ప్రపంచంలో పాములకు అస్సలు భయపడని వ్యక్తులు కొందరు ఉన్నారు. వారికి సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు నెట్టింట్లో దర్శనమిస్తుంటాయి. అలాంటి వీడియోనే మరొకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక బాలుడు ఎలాంటి భయం లేకుండా ప్రమాదకరమైన నాగుపాముకి నీరు ఇస్తూ కనిపించాడు. నాగుపాముకు చాలా దాహం వేస్తోందని, అందుకే బాలుడు నీరు ఇస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. బాలుడు బాటిల్ ద్వారా పాముకి నీళ్లు ఎలా ఇస్తున్నాడో, పాము కూడా చాలా హాయిగా నీళ్లు తాగుతున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోలో మరో విశేషమేమిటంటే పాము అతనికి ఎలాంటి హాని తలపెట్టలేదు. ఈ సీన్ చూస్తుంటే వారి మధ్య గాఢమైన స్నేహం ఉందా అనిపిస్తుంది.

గతంలోనూ..

సాధారణంగా పాములు తమకు దగ్గరగా వస్తున్నవారిపై ఎదురుదాడికి దిగుతాయి. కాటేసేందుకు ప్రయత్నిస్తాయి. అందులో నాగుపాము కూడా ఒకటి. దీని విషం మనుషులను క్షణంలో చంపగలదు. అయితే ఇందులో మాత్రం అలా జరగలేదు. s.n.a.k.e_loverr అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్‌ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. పాముకు నీళ్లు తాపి, సపర్యలు చేసిన బాలుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ దృశ్యాన్ని చూసి కొందరు ఆశ్చర్యానికి గురైన ఎమోజీని షేర్ చేస్తుంటే, మరికొందరు అబ్బాయిని మెచ్చుకుంటూ నువ్వు సూపర్‌ బ్రో అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా ఇటీవల మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. గాయపడిన పాముకి ఓపికగా నీళ్లు పట్టి మూగజీవాల పట్ల తన మానవత్వాన్ని చాటుకున్నాడ ఒక వ్యక్తి. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.