ప్రపంచంలో అత్యంత అందమైన ఏనుగు ఇదే..! హెయిర్‌స్టైల్‌కి లక్షలాది మంది అభిమానులు..
"సెంగమలం తన బిడ్డలాంటిదని, ఈ ఏనుగు ఇతర ఏనుగుల నుండి ప్రత్యేకంగా కనిపించాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. ఒకసారి, ఇంటర్నెట్‌లో వీడియో చూస్తుండగా, నాకు బాబ్ కట్‌తో ఉన్న ఏనుగు కనిపించింది. ఆ తర్వాత సెంగమలానికి కూడా జుట్టు పెరిగింది. ఇక అప్పటి నుండి సెంగమలానికి కూడా బాబ్‌కట్ చేస్తూ వస్తున్నానని చెప్పారు.
తమిళనాడుకు చెందిన ఒక ఏనుగు తన డిఫరెంట్ హెయిర్‌స్టైల్‌తో వార్తల్లో నిలుస్తోంది. ఈ ఏనుగు ప్రపంచంలోని అత్యంత అందమైన ఏనుగులలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ఏనుగు పేరు బాబ్‌కట్ సెంగమలం. మన్నార్గుడి పట్టణంలోని రాజగోపాలస్వామి ఆలయంలో ఉండే… ఈ ఏనుగు బాబ్ కట్ హెయిర్‌స్టైల్‌కు దేశవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. బాబ్-కట్ సెంగమలం అని పిలిచే ఈ ఏనుగు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అందిన సమాచారం మేరకు.. 2003లో కేరళ నుంచి రాజగోపాలస్వామి ఆలయానికి సెంగమలం ఏనుగును తీసుకొచ్చారు. మౌట ఎస్ రాజగోపాల్ ఈ ఏనుగు హెయిర్ స్టైల్ చూసుకుంటున్నారు. ఈ హెయిర్‌స్టైల్‌కు చాలా మెయింటెనెన్స్, కేర్ అవసరమని మావుటా చెబుతున్నారు. ఈ ఏనుగు అందరిలోకి ప్రత్యేకంగా ఉండాలని ఈ హెయిర్ స్టైల్ చేయించినట్లుగా నివేదికలో వెల్లడించారు.
She is famously known as “Bob-cut Sengamalam” who has a huge fan club just for her hair style. You can see her at Sri Rajagopalaswamy Temple, Mannargudi, Tamilnadu. Pics from Internet. pic.twitter.com/KINN8FHOV3
— Sudha Ramen 🇮🇳 (@SudhaRamenIFS) July 5, 2020
మౌతా రాజగోపాల్ మాట్లాడుతూ, “సెంగమలం తన బిడ్డలాంటిదని, ఈ ఏనుగు ఇతర ఏనుగుల నుండి ప్రత్యేకంగా కనిపించాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. ఒకసారి, ఇంటర్నెట్‌లో వీడియో చూస్తుండగా, నాకు బాబ్ కట్‌తో ఉన్న ఏనుగు కనిపించింది. ఆ తర్వాత సెంగమలానికి కూడా జుట్టు పెరిగింది. ఇక అప్పటి నుండి సెంగమలానికి కూడా బాబ్‌కట్ చేస్తూ వస్తున్నానని చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..