AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేప కళ్లు వేస్ట్‌ అని పడవేస్తున్నారా..? ఇది పోషకాల నిధి..! విటమిన్‌ బి 12తో పాటు మరెన్నో పోషకాలు..

చేపలంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. చికెన్‌, మటన్‌ కంటే కూడా చేపల్ని ఇష్టంగా తినేవాళ్లు ఉంటారు. మాంసం కంటే కూడా చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి. చేపలు విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు వంటి అనేక ముఖ్యమైన అంశాలను కలిగి ఉంటాయి. చేపలో విటమిన్ B12 కూడా ఉంటుంది. ఇదిఎర్ర రక్త కణాల అభివృద్ధికి, నాడీ వ్యవస్థ మంచి పనితీరుకు సహాయపడుతుంది. అయితే, ఫిష్ ఐ తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని మీకు తెలుసా.? మీరు చెత్తగా భావించి పడవేసే చేప కళ్లు చాలా బెస్ట్‌ అంటున్నారు పోషకాహార నిపుణులు. చేప కళ్లు తినడం వల్ల మన ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Aug 03, 2024 | 5:18 PM

Share
పోషకాలు: చేపలను తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, దాని కంటిలో కూడా అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. చేపల కళ్లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేక వ్యాధుల నుండి మనలను రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. విటమిన్లు, ఖనిజాలు మంచి ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

1 / 5
చర్మ ఆరోగ్యం : చేపలో కొల్లాజెన్ ఉంటుంది. కొల్లాజెన్ ఒక రకమైన ప్రోటీన్. ఇది చర్మం, కీళ్ళు, జుట్టు, గోళ్ళకు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. కొల్లాజెన్ మన శరీరంలో ఉంటుంది. కానీ వయస్సుతో, తేమ స్థాయి తగ్గుతుంది. మనం చేపల కన్ను తినడం వల్ల కొల్లాజెన్ మన శరీరంలోకి కొంత వరకు చేరుతుంది.

2 / 5
జ్ఞాపకశక్తి మెరుగుదల : ఈ రోజుల్లో ప్రజలు వివిధ రకాల పనులతో తరచూ ఒత్తిడి లోనవుతున్నారు. వారి స్ట్రెస్‌ మొత్తం మెదడుపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది. వృద్ధులు, పిల్లలతో సహా ప్రతి ఒక్కరిలో జ్ఞాపకశక్తిని పెంచడానికి చేప కళ్లు తినాలని నిపుణులు చెబుతున్నారు. చేపలలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సహాయంతో బలహీనమైన జ్ఞాపకశక్తిని మెరుగుపరచవచ్చు.

3 / 5
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, చేపలు, వాటి కళ్లలో ఉండే, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌ల వినియోగం నేర్చుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. మెదడులో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అయితే, ఇక్కడ ఒక విషయం మీరు గుర్తించుకోవాలి. చేపల కళ్లను తినటం వల్ల కొంతమందికి అలెర్జీ ఉండవచ్చు. కాబట్టి జాగ్రత్తగా తినాలంటున్నారు.

4 / 5
చేపలు తినే ప్రతి ఒక్కరూ చేప కళ్ళు తినలేరు. అలర్జీ వంటి సమస్య వారిని వేధిస్తుంది. చేపలు వండడానికి ముందు వాటి కళ్లను సరిగ్గా శుభ్రం చేయకపోతే ఇతర సమస్యలు కూడా వస్తాయి. అలర్జీ లేదా మరే ఇతర సమస్యలు లేని వారు మాత్రమే ఫిష్ ఐని తినాలంటున్నారు పోషకాహార నిపుణులు. అంతేగానీ, బలవంతంగా తినవద్దు అని చెబుతున్నారు.

5 / 5