Photo Puzzle: మీకున్నదల్లా 5 సెకన్లే.! మీవైపే చూస్తోన్న చిరుతను గుర్తిస్తే మీరే తోపులని లెక్క..
పజిల్స్ మన బుర్రను షార్ప్ చేయడమే కాదు.. మనల్ని యాక్టివ్‌గానూ ఉంచుతాయి. ఇటీవల ఈ ఫోటో పజిల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ పజిల్స్‌లో చాలానే టైప్స్ ఉన్నాయి. పదాలతో కూడిన పజిల్స్ కొన్ని అయితే..
పజిల్స్ మన బుర్రను షార్ప్ చేయడమే కాదు.. మనల్ని యాక్టివ్‌గానూ ఉంచుతాయి. ఇటీవల ఈ ఫోటో పజిల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ పజిల్స్‌లో చాలానే టైప్స్ ఉన్నాయి. పదాలతో కూడిన పజిల్స్ కొన్ని అయితే.. మీ ఐ పవర్ టెస్ట్ చేసే పజిల్స్ మరికొన్ని. ఇంకొన్నింటిలో అయితే ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుంది. మీ కళ్ళనే మోసం చేసేస్తాయి ఇలా పజిల్స్. ఇక ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలైతే.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతాయి. ఇక తాజాగా అలాంటి ఓ క్రేజీ పజిల్‌ను మీ ముందుకు తీసుకువచ్చాం.
పైన పేర్కొన్న చిత్రాన్ని మీరు చూశారా.? అది చూడటానికి అటవీ ప్రాంతంలా కనిపిస్తోంది కదూ.! కరెక్టే మీరు గెస్ చేసేది. ఆ రాళ్లు, రప్పలు ఉన్న అటవీ ప్రాంతంలో ఓ చిరుత నక్కి ఉంది. అది ఎంచక్కా మీవైపే చూస్తోంది. మీ కళ్లు షార్ప్ అయితే.. కేవలం 5 సెకన్లలో మీరు కనిపెట్టొచ్చు. ఆలోపు కనిపెడితే మీ కళ్ల ఫోకస్ అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఇంకా లేటయితే మాత్రం మీ దృష్టి సరిగ్గా లేనట్లే. ఒకవేళ ఎంత వెతికినా సమాధానం దొరక్కపోతే కంగారుపడకండి.! ఆన్సర్ ఉన్న ఫోటోను మేమే కింద ఇచ్చేశాం.
here is the answer pic.twitter.com/oHanKB8TOm
— telugufunworld (@telugufunworld) August 3, 2024