Viral Video: అమాంతం బైక్ తో సహా కారును గుద్దేశాడు.. గాల్లోనే కలిసిపోయిన ప్రాణాలు.. షాకింగ్ వీడియో
డ్రైవింగ్ (Driving) చేయడం అంటే చిన్న పిల్లలు ఆడుకునే ఆటల్లాంటివి కాదు. బైక్, కారు, వాహనం నడపడం పూర్తిగా నేర్చుకున్న తర్వాతే రోడ్డుపైకి వెళ్లడం మంచిది. ఎందుకుంటే సరిగ్గా డ్రైవింగ్ చేయకపోతే పెను నష్టం మిగిలే అవకాశం...
డ్రైవింగ్ (Driving) చేయడం అంటే చిన్న పిల్లలు ఆడుకునే ఆటల్లాంటివి కాదు. బైక్, కారు, వాహనం నడపడం పూర్తిగా నేర్చుకున్న తర్వాతే రోడ్డుపైకి వెళ్లడం మంచిది. ఎందుకుంటే సరిగ్గా డ్రైవింగ్ చేయకపోతే పెను నష్టం మిగిలే అవకాశం ఉంది. కొన్నిసార్లు ప్రాణాలే పోవచ్చు కూడా. ఎందుకంటే ప్రమాదం ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. అయితే.. బాగా డ్రైవింగ్ చేయడం తెలిసిన వారు కూడా చాలాసార్లు రోడ్డు ప్రమాదాల (Road Accident) బారిన పడుతున్నారు. అతివేగంగా వెళ్లే వాహనాల వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా తరచూ చోటుచేసుకుంటున్నాయి. అలాంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో వర్షం కురుస్తున్న సమయంలో ఓ వ్యక్తి బైక్ పై.. వేగంగా వెళ్తు కారును బలంగా ఢీ కొంటాడు. దీంతో బైక్ రైడర్ గాల్లో ఎగిరి కారుపై పడి.. అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇవి కూడా చదవండి— Priyo Priharsoko (@priyopriharsoko) July 19, 2022
బైక్‌పైనుంచి కారుపై బలంగా పడటంతో అతనిలో ఎలాంటి స్పందనలు లేవు. దీంతో అప్రమత్తమైన స్థానికులు దగ్గరకెళ్లి చూసేసరికి అతడు చనిపోయాడు. ఈ షాకింగ్ వీడియో డాష్ క్యామ్ ట్వాట్స్ అనే ఐడీతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 30 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు 53 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను లైక్ చేసి, రకరకాల రియాక్షన్స్ ఇస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..