Neeraj Chopra: చరిత్ర సృష్టించిన ‘బల్లెం వీరుడి’పై ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు ప్రశంసల వర్షం.. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ సంబరాలు

ఓటమి అంచునుంచి విజయాన్ని సొంతం చేసుకోవడంలోనే మ్యాజిక్ ఉంది.. అదే మ్యాజిక్  ను నీరజ్ చోప్రా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చేశాడు. పౌల్ తో ప్రారంభించి.. చివరికి రజత పతకాన్ని సాధించగలిగాడు. నీరజ్ విజయాన్ని తమ విజయంగా భావించి దేశంలోని గల్లీ నుంచి పార్లమెంటు వరకు సంబరాలు చేసుకుంటున్నారు.

Neeraj Chopra: చరిత్ర సృష్టించిన 'బల్లెం వీరుడి'పై ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు ప్రశంసల వర్షం.. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ సంబరాలు
Pm Modi Neeraj
Follow us
Surya Kala

|

Updated on: Jul 24, 2022 | 11:49 AM

Neeraj Chopra: అమెరికా(America) గడ్డపై నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు.  ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో (World Athletics Championships) రజత పతకం అందుకుని భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. దేశ వ్యాప్తంగా నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడే చోట.. ప్రస్తుతం క్రీడల గురించి, ముఖ్యంగా నీరజ్ చోప్రా గురించి కూడా చర్చ జరుగుతోంది. నీరజ్ చోప్రాపై ప్రధాని మోడీ, నీరజ్ తల్లిదండ్రులు, గ్రామస్థులు, అనేక మంది ప్రజాపతినిధులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్ లో దేశానికి మొదటిసారిగా సిల్వర్ మెడల్ ను అందించిన 24 ఏళ్ల భారతీయ యువకుడు నీరజ్ వైపే ప్రస్తుతం ప్రపంచం మొత్తం దృష్టి సారిస్తోంది.

ఓటమి అంచునుంచి విజయాన్ని సొంతం చేసుకోవడంలోనే మ్యాజిక్ ఉంది.. అదే మ్యాజిక్  ను నీరజ్ చోప్రా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చేశాడు. పౌల్ తో ప్రారంభించి.. చివరికి రజత పతకాన్ని సాధించగలిగాడు. నీరజ్ విజయాన్ని తమ విజయంగా భావించి దేశంలోని గల్లీ నుంచి పార్లమెంటు వరకు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

నీరజ్ చోప్రాకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు సాయ్ మీడియా చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ నీరజ్ చోప్రాను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. చారిత్రాత్మక రజతం సాధించిన నీరజ్‌ని అభినందిస్తున్నామని.. ఈ క్షణం భారత క్రీడలకు అద్భుతమని అన్నారు.

ఇతర కేంద్ర మంత్రులు కూడా ఆయనపై ప్రశంసలు కురిపించారు. కిరణ్ రిజిజు ట్వీట్ చేస్తూ, “నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అతను అంజు బాబీ జార్జ్ తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన మొదటి భారతీయుడు కావడంతోపాటు రెండో భారతీయుడు అని పేర్కొన్నారు.

నీరజ్ చోప్రా రజత పతకం సాధించడం పట్ల ఆమె తల్లి సరోజ్ దేవి సంతోషం వ్యక్తం చేశారు. నీరజ్ తల్లి సరోజ్ దేవి మాట్లాడుతూ.. తమ కుమారుడు ఖచ్చితంగా పతకం సాధిస్తాడని నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు. నీరజ్ కృషి ఫలించిందని చెప్పారు.

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఫౌల్‌తో ప్రారంభించిన నీరజ్ చోప్రా  88.13 మీటర్లు విసిరి సిల్వర్ మెడల్ అందుకున్నాడు. గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 90.46 మీటర్లతో స్వర్ణం గెలుచుకోగా, చెక్ రిపబ్లిక్‌కు చెందిన యాకుబ్ వాల్దేష్ కాంస్యం అందుకున్నాడు. భారత్‌కు చెందిన రోహిత్ యాదవ్ 78.72 మీటర్లు విసిరి 10వ స్థానంలో నిలిచాడు.

ఇప్పుడు నీరజ్ చోప్రా తదుపరి మిషన్ కామన్వెల్త్ గేమ్స్. దేశానికి పసిడి పతకం అందిస్తాడంటూ నీరజ్ అభిమానులతో పాటు క్రీడాభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు