Arshad On Neeraj: నీరజ్ ‘జావెలిన్’ ఖరీదు రూ.4 లక్షలు.. ఆ సౌకర్యాలు మాకు ఎక్కడ అంటున్న పాక్ జావెలర్ అర్షద్
నీరజ్ చోప్రా కూడా పాల్గొన్న ప్రతి జావెలిన్ ఈవెంట్‌లో అర్షద్ కనిపిస్తాడు. అయితే ఇద్దరి కథ ఒకేలా ఉండదు. ఎందుకంటే నీరజ్ పతకం గెలుస్తాడు.. పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ ప్రతిసారీ ఖాళీ చేతులతో తిరిగి వస్తాడు.
Arshad On Neeraj: అమెరికాలోని యూజీన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్ త్రో లో రజత పతాకాన్ని సొంతం చేసుకున్నాడు. భారత జాతీయ పతాకాన్ని వినువీధుల్లో ఎగిరేలా చేశాడు. 2003 లో అంజు జార్జి కాంస్యం తర్వాత దేశానికి ఈ క్రీడల్లో పతకం తెచ్చిన క్రీడారుడిగా రికార్డ్ సృష్టించాడు. అయితే నీరజ్ విజయంపై పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ స్పందించాడు. నీరజ్ చోప్రా సిల్వర్ ను సొంతం చేసుకుంటే.. అర్షద్ నదీమ్ ఈ ఈవెంట్ లో 88.13 మీటర్ల త్రో విరిసి 5వ స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ స్పియర్‌హెడ్ ఒలింపిక్స్‌లో కూడా 5వ స్థానంతో తన జర్నీని ముగించాడు. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కూడా అదే స్థానంతో తన ప్రయాణాన్ని ముగించాడు.
నీరజ్ చోప్రా కూడా పాల్గొన్న ప్రతి జావెలిన్ ఈవెంట్‌లో అర్షద్ కనిపిస్తాడు. అయితే ఇద్దరి కథ ఒకేలా ఉండదు. ఎందుకంటే నీరజ్ పతకం గెలుస్తాడు.. పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ ప్రతిసారీ ఖాళీ చేతులతో తిరిగి వస్తాడు. అయితే నీరజ్ చోప్రా పతకం ఎలా గెలుస్తారనేది ప్రశ్నకి అర్షద్ నదీమ్ పాక్ మీడియాకు సమాధానం చెప్పాడు. .
నీరజ్ జావెలిన్ ఖరీదు రూ. 4 లక్షలు: అర్షద్ నదీమ్ పాక్ మీడియాతో మాట్లాడుతూ..తాను పతకానికి ఎందుకు అడుగు దూరంలో నిలుస్తున్నాడో.. చెప్పాడు. “ప్రపంచ స్థాయిలో ఉపయోగించే జావెలిన్ పాకిస్తాన్‌లో కనిపించదు. ఆ జావెలిన్ ధర రూ.4 లక్షలు. పాకిస్థాన్‌లో ఇప్పటి వరకు అలాంటి జావెలిన్ లేదు. అదే జావెలిన్‌ను పెద్ద ఈవెంట్‌ల సన్నాహాల్లో కూడా ఉపయోగిస్తారు. “పాకిస్తాన్ క్రీడాకారుల సమస్య ఒక్క జావెలిన్ మాత్రమే కాదు. ప్రాథమిక సౌకర్యాలు, సన్నాహక మైదానాలు కూడా కొరతే. మాకు ప్రపంచ వ్యాప్తంగా పోటీల్లో పాల్గొనేందుకు సన్నాహాలకు సరిపడా సౌకర్యాలు లేవు. ఒకే మైదానంలో క్రీడాకారులు సాధారణ చేస్తామని తెలిపారు.
ఈవెంట్ నదీమ్ మంచి ప్రదర్శన కనబరిచాడని నీరజ్ అభినందనలు తెలిపాడు. “పోటీ ముగిసిన తర్వాత తాను అర్షద్‌తో మాట్లాడినట్లు.. అతను మంచి ప్రదర్శన ఇచ్చినట్లు చెప్పాడు. గాయం కోలుకున్న అర్షద్ 86 మీటర్లకు పైగా జావెలిన్ విసిరినందుకు.. అభినందనీయం, ”అని నీరజ్ చెప్పాడు. నీరజ్ చోప్రా పాకిస్థాన్ ఆటగాడు నదీమ్‌తో మంది సంబంధం ఉన్న సంగతి తెలిసిందే. జకార్తా 2018లో జరిగిన ఆసియా క్రీడల పోడియంపై వీరిద్దరూ ఆలింగనం చేసుకున్నారు.
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన నీరజ్ చోప్రా 88.13 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అదే సమయంలో పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ 5వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఈ పోటీలో గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.
పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ ఈ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశానికి చెందిన నీరజ్ చోప్రా కంటే వెనుకబడి ఉండటమే కాదు, అంతకు ముందు టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ అగ్రస్థానంతో పోల్చితే అతను 5వ స్థానంలో ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..