World Athletics Championships: మెన్స్ జావెలిన్ త్రోలో రజత పతాకాన్ని సొంతం చేసుకున్న నీరజ్ చోప్రా

టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతాకాన్ని అందుకున్న నీరజ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్ త్రో ఫైనల్‌ ల్లో 12మందితో తలపడ్డాడు. తన నాల్గవ ప్రయత్నంలో 88.13 మీటర్లు విసిరి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

World Athletics Championships: మెన్స్ జావెలిన్ త్రోలో రజత పతాకాన్ని సొంతం చేసుకున్న నీరజ్ చోప్రా
Neeraj Chopra
Follow us
Surya Kala

|

Updated on: Jul 24, 2022 | 8:37 AM

World Athletics Championships: అమెరికాలోని ఒరెగాన్‌లో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా మరో చారిత్రాత్మక అధ్యాయాన్ని లిఖించాడు. ఆదివారం ఉదయం క్రీడాభిమానులకు రజత పతకంతో పసందైన విందు ఇచ్చాడు. 88.13 మీటర్లు విసిరి సిల్వర్ మెడల్ ను సొంతం చేసుకున్నాడు నీరజ్ చోప్రా. స్వర్ణ పతకం పై అసలు కల్పించిన నీరజ్ తన మొదటి ప్రయత్నాన్ని ఫౌల్ త్రో తో ప్రారంభించాడు. రెండో ప్రయత్నంలో నీరజ్ చోప్రా: 82.39మీ విసిరి.. 4వ స్థానానికి చేరుకున్నాడు. నీరజ్ తన మూడో ప్రయత్నంలో 86.37 మీటర్లు విసిరాడు. తన నాల్గవ ప్రయత్నంలో 88.13 మీటర్లు విసిరి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ బంగారు పతాకాన్ని సొంతం చేసుకున్నాడు.

2003లో అథ్లెటిక్స్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో లాంగ్ జంప్ లో కాంస్య పతాకాన్ని అంజు బాబీ జార్జ్ గెలుచుకున్న ఏకైక భారతీయురాలిగా నిలిచింది. 2022లో నీరజ్ మళ్ళీ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పతాకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించాడు.

ఇవి కూడా చదవండి

టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతాకాన్ని అందుకున్న నీరజ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్ త్రో ఫైనల్‌ ల్లో 12మందితో తలపడ్డాడు. జూలై 22న జరిగిన క్వాలిఫైయింగ్ రౌండ్‌లో.. ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించేందుకు నీరజ్ 88.39 మీటర్ల దూరాన్ని విసిరాడు. అర్హత మార్కును అధిగమించడానికి నీరజ్‌ కేవలం త్రో మాత్రమే పట్టడం విశేషం.

అయితే నీరజ్ తో పాటు.. మరో భారతీయ క్రీడాకారుడు రోహిత్ యాదవ్ కూడా ఫైనల్ లో పతకం కోసం పోటీపడ్డాడు.  ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఒకే ఎడిషన్ లో ఇద్దరు భారతీయ క్రీడాకారులు అదీ జావెలిన్ త్రో లో ఫైనల్ రౌండ్ కు చేరుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి. క్వాలిఫైయింగ్ రౌండ్ లో  80.42 మీటర్ల త్రో విసిరి.. రోహిత్ యాదవ్  11వ స్థానంలో నిలిచి ఫైనల్‌లో చోటు దక్కించుకున్నాడు. దీంతో భారత్‌కు రెట్టింపు ఆనందం దక్కింది.  అయితే జావెలిన్ త్రో ఫైనల్లో రోహిత్ యాదవ్ మొదటి మూడు ప్రయత్నాల తర్వాత నిష్క్రమించాడు. అతను తన అత్యుత్తమ 78.72 మీటర్లతో 10వ స్థానంలో నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..