Hyderabad: మెట్రోలో మరోసారి సాంకేతిక లోపం.. ఆ రూట్లో గంట ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు
హైదరాబాద్ (Hyderabad) మెట్రోలో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా నాగోల్ నుంచి రాయదుర్గం రూట్ లో మెట్రో రైళ్లు (Metro Trains) ఆలస్యంగా నడుస్తున్నాయి. గంట ఆలస్యంగా సర్వీసులు ఉండటంతో ప్రయాణికులు...
హైదరాబాద్ (Hyderabad) మెట్రోలో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా నాగోల్ నుంచి రాయదుర్గం రూట్ లో మెట్రో రైళ్లు (Metro Trains) ఆలస్యంగా నడుస్తున్నాయి. గంట ఆలస్యంగా సర్వీసులు ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రత్యామ్నాయ వాహనాల్లో గమ్యస్థానాలకు చేరుకున్నారు. కాగా.. మెట్రో కార్డ్స్, టికెటింగ్ మిషన్స్ పనిచేయకపోవడంతో సమస్య తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. కాగా.. ప్రయాణికులను త్వరగా గమ్య స్థానాలకు చేర్చేందుకు, హైదరాబాద్(Hyderabad) నగరంలోని ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ఏర్పాటైన మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్యలు ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి.
గతంలో ముసారాంబాగ్ మెట్రో స్టేషన్ లో రైలు ఆగిపోయిన ఘటన, నాంపల్లి మెట్రో స్టేషన్ (Nampalli Metro Station) ఘటనతో రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. మిగతా కారిడార్లలోనూ మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. మెట్రో స్టేషన్లలో భారీగా ప్రయాణికులు చేరడంతో ఆయా స్టేషన్లు రద్దీగా మారాయి. భవిష్యత్తులో సాంకేతిక సమస్యలు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి