AP Crime News: పల్నాడులో రెచ్చిపోయిన డ్వాక్రా యానిమేటర్‌,వారి బంధువులు..యూనియన్ బ్యాంక్ సిబ్బందిపైనే దాడి

అంతటితో ఆగక స్ధానికంగా ఉన్న తమ బంధువులను పిలిపించి అసిస్టెంట్ మేనేజర్ ప్రభుదాస్ పై అమృతవేణి, ఆమె బంధువులు దాడి దిగారు. బ్యాంక్ లో కొంతసేపు హల్చల్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సిసి కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

AP Crime News: పల్నాడులో రెచ్చిపోయిన డ్వాక్రా యానిమేటర్‌,వారి బంధువులు..యూనియన్ బ్యాంక్ సిబ్బందిపైనే దాడి
Dwakra Animator Attack
Follow us

|

Updated on: Jul 23, 2022 | 10:00 PM

Attack on Bank Employee:  పల్నాడు జిల్లా అమరావతిలో యూనియన్ బ్యాంక్ సిబ్బందిపై రెచ్చిపోయారు డ్వాక్రా యానిమేటర్, ఆమె బంధువులు. డ్వాక్రా లోన్ అమౌంట్ విత్ డ్రా చేసేందుకు వెళ్లిన యానిమేటర్ చెక్ ను రిజక్ట్ చేశాడు అసిస్టెంట్ మేనేజర్. చెక్క్ పై స్టాంప్ వేయించుకురావాలని సూచించాడు. లేదంటే డబ్బులు విత్ డ్రా చేయడం కుదరదని తేల్చి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన నరుకుళ్ళపాడుకు చెందిన డ్వాక్రా యానిమేటర్ అమృతవేణి అసిస్టెంట్ మేనేజర్ తో గొడవకు దిగింది. అంతటితో ఆగక స్ధానికంగా ఉన్న తమ బంధువులను పిలిపించి అసిస్టెంట్ మేనేజర్ ప్రభుదాస్ పై అమృతవేణి, ఆమె బంధువులు దాడి దిగారు. బ్యాంక్ లో కొంతసేపు హల్చల్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సిసి కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

అమృతవేణి, ఆమె బంధువుల దాడిలో అసిస్టెంట్ మేనేజర్ ప్రభుదాస్ తోపాటు మరో ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయిస్ కి గాయాలయ్యాయి. దాడిని తీవ్రంగా తప్పుబట్టిన బ్యాంక్ ఎంప్లాయిస్ అమరావతి యూనియన్ బ్యాంక్ ముందు ధర్నాకు దిగారు. బ్యాంక్ ఎంప్లాయిస్ పై చేయి చేసుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు .

అంతేకాదు దాడిని ఖండిస్తూ అమరావతిలో నిరసన ర్యాలీ చేశారు బ్యాంక్ ఎంప్లాయిస్. అన్యాయంగా బ్యాంక్ సిబ్బందిపై దాడి చేసిన నిందితులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలంటూ డిమాండ్. అమరావతి పియస్ లో యానిమేటర్ అమృతవేణి, ఆమె బంధువులపై బ్యాంక్ సిబ్బంది పిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles