AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: అయ్య బాబోయ్.. వధువును ఇంప్రెస్ చేద్దామనుకుంటే.. ఇలా అయ్యిందేంటి..!

నెట్టింట ఎన్నో ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.. వాటిలో కొన్ని వివాహ వేడుకలకు సంబంధించినవి కూడా ఉంటాయి.. వాస్తవానికి వివాహ వేడుక అంటే.. సందడే సందడి ఉంటుంది.. అటు వరుడు.. ఇటు వధువు ముసిముసి నవ్వులు.. మధ్యలో బంధువుల హడావుడి అంతఇంతా కాదు.. ఇలా పెద్దల ముంగిట వధూవరులిద్దరూ ఒక్కటవుతారు..

Video Viral: అయ్య బాబోయ్.. వధువును ఇంప్రెస్ చేద్దామనుకుంటే.. ఇలా అయ్యిందేంటి..!
Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Aug 20, 2024 | 4:56 PM

Share

నెట్టింట ఎన్నో ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.. వాటిలో కొన్ని వివాహ వేడుకలకు సంబంధించినవి కూడా ఉంటాయి.. వాస్తవానికి వివాహ వేడుక అంటే.. సందడే సందడి ఉంటుంది.. అటు వరుడు.. ఇటు వధువు ముసిముసి నవ్వులు.. మధ్యలో బంధువుల హడావుడి అంతఇంతా కాదు.. ఇలా పెద్దల ముంగిట వధూవరులిద్దరూ ఒక్కటవుతారు.. అయితే.. అలాంటి పెళ్లి వేడుకను జీవితంలో మరపురాని రోజుగా చేద్దామనుకున్నాడు.. ఓ వరుడు.. అంతా చూస్తుండగా వధూవరులిద్దరూ.. స్టేజ్ పైకి వచ్చారు.. నవ దంపతులు ఒకరికొకరు చేయిచేయి పట్టుకోని కనిపించగా.. రొమాంటిక్ మ్యూజిక్ ప్లే అవుతోంది. దీంతో ఇద్దరూ ఆ మ్యూజిక్ కు తగినట్లు సింక్‌గా డ్యాన్స్ చేస్తున్నారు. డ్యాన్స్ చేస్తూ వధువును ఒడిలోకి తీసుకుంటుండగా.. అకస్మాత్తుగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.. ఆహ్వానితుల ముందు యువకుడి ప్యాంటు (కుట్లు ఊడిపోయాయి..) పగిలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

వివాహ వేడుక వీడియోలో, వధువు తెల్లటి గౌను ధరించి కనిపించింది. వరుడు నల్లటి ప్యాంటు మీద తెల్లటి కోటు ధరించాడు.. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నట్లు అర్ధమవుతోంది.. అయితే.. వివాహా వేడుకలో.. వధూవరుడు స్టేజీపై ఉండగా.. వారి వెనుక ఉన్న స్క్రీన్‌పై, వారి పాత ఫోటోలు ఒక్కొక్కటిగా ప్రదర్శిస్తున్నారు.. ఇద్దరూ పాటలోని రొమాంటిక్ రిథమ్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారు.. ఈ క్రమంలో.. ఆహ్వానితులు వారి చుట్టూ నిలబడి వారిని చూస్తూ అభినందిస్తున్నారు.. డ్యాన్స్ మధ్యలో వరుడు.. వధువును ఎత్తుకున్నాడు.. ఇంతలోనే.. యువకుడు ఆమెను మళ్లీ కిందకు దించాడు. ఆ తర్వాత అకస్మాత్తుగా ప్యాంటును పట్టుకుని చాటుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు.

వీడియో చూడండి..

దీంతో ఆహ్వానితులు అంతా ఒక్కసారిగా నవ్వుతూ కనిపించారు.. వరుడు ధరించిన ప్యాంట్ కు.. కుట్లు ఊడిపోయి.. అకస్మాత్తుగా పగిలిపోయింది.. దీంతో ఒక్కసారిగా అతను వధువును కిందకు దించాడు.. ఆమె కూడా నవ్వుతూ భర్తను వెనక్కు తీసుకుపోయింది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫన్నీ వీడియోను చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు..

ఈ వీడియో .. ఎక్కడిది.. ఎవరిది.. అన్న విషయాన్ని మాత్రం సోషల్ మీడియాలో పంచుకోలేదు.. కానీ.. నెట్టింట వైరల్ అవుతోంది..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us