Watch: ఓరీ దేవుడో భారీ కొండ నిలువునా కూలింది.. పవర్‌ స్టేషన్‌ పూర్తిగా ధ్వంసం.. షాకింగ్‌ వీడియో వైరల్‌..

510 మెగావాట్ల పవర్ స్టేషన్‌ను అనుకుని ఉన్న కొండ గత కొన్ని వారాలుగా కొంచెం కొంచెం కూలుతూ వస్తోంది. ఆగస్టు 20 మంగళవారం పూర్తిగా విరిగిపడింది. ఈ విధ్వంసకర దృశ్యం కెమెరాలో రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. కాగా, ప్ర‌స్తుతం స్టేజ్ 5 డ్యామ్ ఫంక్ష‌న్‌లో లేదని సమాచారం.

Watch: ఓరీ దేవుడో భారీ కొండ నిలువునా కూలింది.. పవర్‌ స్టేషన్‌ పూర్తిగా ధ్వంసం.. షాకింగ్‌ వీడియో వైరల్‌..
Sikkim Landslide
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 20, 2024 | 5:10 PM

సిక్కింలో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. వరుణుడి ప్రకోపానికి భారీ ప్రమాదం సంభవించింది. సింగ్టామ్ జిల్లాలోని దీపు దారాలోని బలుతార్ ప్రాంతంలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్‌కు చెందిన తీస్తా స్టేజ్ 5 డ్యామ్‌లోని పవర్ స్టేషన్ పూర్తిగా ధ్వంసమైంది. 510 మెగావాట్ల పవర్ స్టేషన్‌ను అనుకుని ఉన్న కొండ గత కొన్ని వారాలుగా కొంచెం కొంచెం కూలుతూ వస్తోంది. ఆగస్టు 20 మంగళవారం పూర్తిగా విరిగిపడింది. ఈ విధ్వంసకర దృశ్యం కెమెరాలో రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. కాగా, ప్ర‌స్తుతం స్టేజ్ 5 డ్యామ్ ఫంక్ష‌న్‌లో లేదని సమాచారం.

ఈ వీడియో చూడండి..

ఈ ప్రకృతి విపత్తులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిసింది. అయితే, ముందుజాగ్రత్త చర్యగా తీస్తా-వి పవర్ స్టేషన్‌లోని అన్ని యూనిట్లను తాత్కాలికంగా మూసివేశారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చి పూర్తి అంచనా వేసే వరకు ఈ యూనిట్లలో కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. ఈ కొండచరియలు విరిగిపడటం వల్ల మౌలిక సదుపాయాలకు ఎంత నష్టం జరిగింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. దీనిపై ఎన్‌హెచ్‌పీసీ అధికారులు నిఘా ఉంచారు.

ఇదిలా ఉంటే, మరోవైపు జమ్ముకశ్మీర్‌లో సంభవించిన భూకంపం ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేసింది. ఆగస్టు 20 మంగళవారం తెల్లవారుజామున జమ్ముకశ్మీర్‌లో భూకంపం సంభవించింది. బారాముల్లా ప్రాంతంలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 4.9గా నమోదైంది. పలు ప్రాంతాల్లో ప్రజలు భయంతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..