Watch: ఇదేక్కడి విడ్డూరం..! కోడలిపై మనసుపడ్డ అత్తగారు.. భర్తను వదిలేసి గుళ్లో పెళ్లి.. వైరలవుతున్న వీడియో
శోభ అనే మహిళ సుమన్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ బంధువులు. వరుసకు అత్తా, కోడలు అవుతారు. శోభ అత్త.. ఈమేకు గతంలోనే మరో వ్యక్తితో పెళ్లైంది. కానీ, గత మూడేళ్లుగా శోభ, సుమన్‌ను ప్రేమిస్తోంది. మూడేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఉన్నట్టుండి ఊళ్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. గ్రామంలోని ఓ ఆలయంలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.
ప్రేమ గుడ్డిది అంటుంటారు. అలాంటి ప్రేమ ఎప్పుడు, ఎవరిపై ఎలా పుడుతుందో తెలియదు. ఎవరిలోనైనా, ఎవరిపై అయినా కలుగవచ్చు. లవ్‌లో ఉన్నవారు తమ ప్రేమ గెలిపించుకోవటానికి ఎంతకైనా తెగిస్తుంటారు. తమ ప్రియుడు, ప్రియురాలి కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడరు. ఇక కొన్ని ప్రేమలు పెళ్లి వరకు వెళ్తాయి. మరికొన్ని ప్రేమలు అనేక కారణాల వల్ల విషాదాంతంగా మిగిలిపోతుంటాయి. అలాగే, మరికొందరు కొంతకాలం ప్రేమించుకుంటారు.. ఆ తర్వాత విడిపోయినవారు కూడా ఉంటారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎన్నో వస్తూనే ఉన్నాయి. ఇలాంటి ప్రేమ పెళ్లిళ్ల గురించి మీరు అనేకం చూసి ఉంటారు. విని ఉంటారు. కానీ, ఇక్కడ జరిగింది మాత్రం నిజంగానే వింత వివాహం అని చెప్పాలి. ఓ మహిళ తన భర్తను వదిలేసి కోడల్ని పెళ్లి చేసుకున్న ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ పెళ్లిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
సాధారణంగా అత్తా, కోడలు. అంటే.. కొట్లాటలు, పంచాయతీలు వింటుంటాం. ఈ ఇద్దరి పంచాయతీ తీర్చలేక ఇంట్లోని మగవాళ్లు అలసిపోతుంటారు. అయితే ఇక్కడ మాత్రం ఓ అత్తగారు తన కోడలిని ప్రేమించి పెళ్లి చేసుకోవటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అవును. మీరు ఇది నిజమే..బీహార్‌లోని పాట్నాకు చెందిన ఓ మహిళ తన భర్తను వదిలేసి తన మేనకోడలిని పెళ్లి చేసుకుంది. బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో ఈ వింత ఘటన జరిగింది. అత్తా కొడళ్లు పెళ్లి చేసుకున్న ఉదంతం కుచాయికోట్ పిఎస్ పరిధిలో వెలుగుచూసింది. బెల్వా నివాసి అయిన అత్త, ఆమె మేనకోడల్ని వివాహం చేసుకుంది. అత్తా, కోడలు కుటుంబ సభ్యులు, బంధువులను కాదని ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. ససముసాలోని దుర్గా భవాని అమ్మవారి ఆలయంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. తన మేనకోడలిపై ప్రేమతో అత్త.. భర్తను కూడా వదిలేసింది. మేనకోడలు అందంగా ఉందని.. మరెవరినైనా పెళ్లి చేసుకుంటే తనని వదిలేస్తుందేమోనని భయపడ్డట్లు అత్త చెప్పింది.
వీడియో చూడండి..
बिहार के गोपालगंज से थोड़ा विचित्र मामला सामने आया है….
जहां मामी और भांजी के बीच प्यार हो गया और दोनों ने जन्म-जन्म तक साथ रहने की कसमें खा ली।
मामी- भांजी ने पुरे रिती रेवाज के साथ शादी कर ली….#SameSexMarriage pic.twitter.com/AyDSUzKZBb
— Afroz Alam (@AfrozJournalist) August 12, 2024
శోభ అనే మహిళ సుమన్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ బంధువులు. వరుసకు అత్తా, కోడలు అవుతారు. శోభ అత్త.. ఈమేకు గతంలోనే మరో వ్యక్తితో పెళ్లైంది. కానీ, గత మూడేళ్లుగా శోభ, సుమన్‌ను ప్రేమిస్తోంది. మూడేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఉన్నట్టుండి ఊళ్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. కాగా, పెళ్లి అనంతరం మాట్లాడిన సుమన్.. శోభ లేని నా జీవితాన్ని ఊహించుకోలేనని.. వేరే పెళ్లి చేసుకుంటే పోతుందేమోనన్న భయం మొదలైంది.. అందుకే ఇప్పుడు ఇల్లు వదిలి పెళ్లి చేసుకున్నామని చెప్పింది. ఈ జంటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, వీడియో చూసిన పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..