అమ్మాయిలకు రక్షణేది..? వెలుగులోకి మరో దారుణం.. పాఠశాలలోనే చిన్నారులపై లైంగిక దాడి..

కోల్‌కతాలో అభయపై అత్యాచారం.. హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.. కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనలు జరుగుతున్నాయి.. ఈ క్రమంలో ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపుల ఘటన మహారాష్ట్రలో సంచలనంగా మారింది..

అమ్మాయిలకు రక్షణేది..? వెలుగులోకి మరో దారుణం.. పాఠశాలలోనే చిన్నారులపై లైంగిక దాడి..
Badlapur News
Follow us

|

Updated on: Aug 20, 2024 | 8:17 PM

కోల్‌కతాలో అభయపై అత్యాచారం.. హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.. కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనలు జరుగుతున్నాయి.. ఈ క్రమంలో ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపుల ఘటన మహారాష్ట్రలో సంచలనంగా మారింది.. దీంతో ముంబై శివార్ల లోని బద్లాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మూడు, నాలుగేళ్ల ఇద్దరు బాలికలపై స్కూల్‌ స్వీపర్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.. కిండర్ గార్టెన్ విద్యార్థులపై లైంగిక దాడిని నిరసిస్తూ స్థానికులు భారీ ఆందోళన చేపట్టారు. బాలికలు చదువుతున్న స్కూల్‌ ఎదుట నిరసనకు దిగారు. అంతేకాకుండా బద్దాపూర్‌ రైల్వే స్టేషన్‌ను ముట్టడించారు. పోలీసులు వాళ్లను అడ్డుకోవడంతో రాళ్ల దాడికి దిగారు. బాలికలు చదువుతున్న కో-ఎడ్ పాఠశాలను కూడా నిరసనకారులు ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు.

ఆందోళనకారులు లోకల్‌ రైళ్లను నిలిపివేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని.. కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం ఏక్‌నాథ్‌ షిండే ప్రకటించారు. ఈ ఘటనపై సిట్‌ ఏర్పాటు చేస్తునట్టు డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ ప్రకటించారు. సిట్ దర్యాప్తు చేసి నివేదిక ఇస్తుందని కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

ఇద్దరు నాలుగేళ్ల చిన్నారులపై స్వీపర్‌ లైంగికదాడికి పాల్పడడంపై స్థానికులు మండిపడుతున్నారు. కాగా.. ఈ ఘటనపై స్కూల్‌ యాజమాన్యం స్పందించింది.. ఇప్పటికే ప్రిన్సిపల్‌ను సస్పెండ్‌ చేసినట్లు వెల్లడించింది.. స్కూల్‌ సిబ్బంది నిర్లక్ష్యం తోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. సీసీటీవీలు స్కూల్లో పనిచేయడం లేదని అంటున్నారు. ఇప్పటికే నిందితుడు అక్షయ్‌ షిండేను పోలీసులు అరెస్ట్‌ చేశారు.ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని.. త్వరలోనే అన్ని వివరాలు చెబుతామని పోలీసులు చెబుతున్నారు.. కాగా.. ఈ ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది..

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వీళ్ల కెరీర్‌లో 'గోల్డెన్ పీరియడ్' క్లోజ్.. ఛాన్స్‌లు రావడం కష్టం
వీళ్ల కెరీర్‌లో 'గోల్డెన్ పీరియడ్' క్లోజ్.. ఛాన్స్‌లు రావడం కష్టం
పంచాయతీలకు గుడ్ న్యూస్.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం..
పంచాయతీలకు గుడ్ న్యూస్.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం..
48 బంతుల్లో 124 పరుగులు.. 8ఏళ్ల క్రితమే టీమిండియాకు దొరికిన వజ్రం
48 బంతుల్లో 124 పరుగులు.. 8ఏళ్ల క్రితమే టీమిండియాకు దొరికిన వజ్రం
సెల్‎ఫోన్ లొకేషన్ అధారంగా మృతదేహాన్ని గుర్తింపు.. అసలు జరిగిందిదే
సెల్‎ఫోన్ లొకేషన్ అధారంగా మృతదేహాన్ని గుర్తింపు.. అసలు జరిగిందిదే
Yuvraj Singh Biopic: యూవీ బయోపిక్‌లో హీరోగా ఎవరంటే?
Yuvraj Singh Biopic: యూవీ బయోపిక్‌లో హీరోగా ఎవరంటే?
తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్ పై సందడి చేసిన నవీన్ పోలిశెట్టి
తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్ పై సందడి చేసిన నవీన్ పోలిశెట్టి
నల్లేరుతో నమ్మలేని లాభాలు..ఔషధ గుణాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు
నల్లేరుతో నమ్మలేని లాభాలు..ఔషధ గుణాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు
వీటిని గడ్డిపోచలా చూడకండి.. రహస్యం తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
వీటిని గడ్డిపోచలా చూడకండి.. రహస్యం తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
ఐ బ్యాంక్‌కి సోద‌రి క‌ళ్లను దానం చేసిన ముర‌ళీ మోహ‌న్ మేక‌ప్..
ఐ బ్యాంక్‌కి సోద‌రి క‌ళ్లను దానం చేసిన ముర‌ళీ మోహ‌న్ మేక‌ప్..
టీమిండియా తదుపరి బుమ్రా ఎవరు.. యార్కర్ కింగ్ ఏమన్నాడంటే?
టీమిండియా తదుపరి బుమ్రా ఎవరు.. యార్కర్ కింగ్ ఏమన్నాడంటే?