Viral Video: కారులోకి ఎక్కాలనుకున్న ఎలుగుబంటి.. తీరా చూస్తే సీన్ రివర్స్.. వైరల్ వీడియో!
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది 'యానిమల్ లవర్స్' ఉన్నారు. వారిలో కొంతమంది కుక్కలు, పిల్లులను పెంపుడు...
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ‘యానిమల్ లవర్స్’ ఉన్నారు. వారిలో కొంతమంది కుక్కలు, పిల్లులను పెంపుడు జంతువులుగా పెంచుకుంటే.. మరికొందరు సింహాలు, పులులు, ఎలుగుబంట్లు వంటి ప్రమాదకరమైన జంతువులను తమ పెట్స్‌గా పెంచుకుంటారు. సాధారణంగా ఎలుగుబంట్లు ఎక్కువగా పర్వతాలు, అడవుల్లో కనిపిస్తాయి. వాటిని పెంపుడు జంతువులుగా పెంచుకోవాలంటే.. లైఫ్‌ని రిస్క్ చేయాల్సిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఎలుగుబంటికి సంబంధించిన ఫన్నీ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దాన్ని చూసిన తర్వాత మీరు కూడా పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు.
వైరల్ వీడియో ప్రకారం.. ఆరెంజ్ కలర్ స్పోర్ట్స్ కారు లంబోర్ఘిని లోపల ఓ వ్యక్తి కూర్చున్నట్లు మీరు చూడవచ్చు. ఇక ఆ కారులోకి ఎలుగుబంటి కిటికీ లోనుంచి లోపలికి ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. అయితే అనూహ్యంగా సీన్ కాస్తా రివర్స్ అయింది. దాని బలం ముందు ఆ కారు డోర్ మొత్తాన్ని ఊడిపోయింది. దీనితో ఎలుగుబంటి భయంతో అక్కడ నుంచి దూరంగా పారిపోతుంది.
View this post on Instagram
కాగా, ఈ ఫన్నీ వీడియోను ‘beautiffulgram’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా.. ఇప్పటివరకు దీనికి 1.50 లక్షల వ్యూస్, 5.4 వేల లైకులు వచ్చాయి. ‘వావ్ ఎలుగుబంటి భలేగా ఎక్కిందంటూ’ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Viral Photos: అగ్గిపెట్టె లాంటి చిన్న ఇల్లు.. లోపల చూస్తే మైండ్ బ్లాకే.. ఫోటోలు వైరల్!
Zodiac Signs: ఈ 5 రాశులవారికి పెళ్లికి తొందరెక్కువ.. ఎన్నో కలలు కంటారు.! అందులో మీరున్నారా..