AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkey Viral Video: ఈ కోతి పిల్ల మామూలుది కాదుగా.. రెండు చేతులతో పట్టేస్తుందటా..

కోతి వేశాలు.. చిలిపి చేష్టలు.. అది చేసే సందడి చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది.. నవ్వు తెప్పిస్తుంది. ఓ చిన్న కోతి వాష్ బేసిన్ వద్ద చేసిన సందడి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Monkey Viral Video: ఈ కోతి పిల్ల మామూలుది కాదుగా.. రెండు చేతులతో పట్టేస్తుందటా..
Water Enjoyment Monkeyandun
Sanjay Kasula
|

Updated on: Nov 30, 2021 | 6:13 PM

Share

Small and Cute Monkey Viral Video: కోతి వేశాలు.. చిలిపి చేష్టలు.. అది చేసే సందడి చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది.. నవ్వు తెప్పిస్తుంది. అంతే కాదు మనం కూడా ఇలా చాలా సార్లు  చేసి ఉండి ఉంటామని గుర్తుకు తెస్తుంది. అయితే నేటి సమయంలో ఇలాంటివి  సోషల్ మీడియా వేదికగా ప్రతిరోజూ వేలాది వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో వివిధ రకాల జంతువుల వీడియోలు కూడా మనకు కనిపిస్తుంటాయి. ఇవి చాలా ఫన్నీగా ప్రజలను అలరిస్తాయి. ప్రస్తుతం కోతుల వీడియోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కోతి పిల్లలు.. రోజంతా సరదాగా గడుపుతారు. అవి చేసే అల్లరి చాలా అందంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు వారి సరదా.. ప్రజలకు ఇబ్బందిగా మారుతోంది.  అయితే తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోను మీరు చూస్తే షాక్ అవుతారు.

ఓ చిన్న కోతి వాష్ బేసిన్ వద్ద చేసిన సందడి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనిని ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. ఈ వీడియోలో ఒక కోతి తన చేతితో నీటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. వాష్ బేసిన్‌లోని కుళాయి దగ్గర ఒక చిన్న అందమైన చిన్న కోతి కూర్చున్నట్లు మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఈ సమయంలో కోతి తన రెండు చేతులతో ఆ పడుతున్న నీటిని పట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. అయితే ఇంతవరకు నీటిని ఎవరూ ఇలా  పట్టుకోలేకపోయారని ఆ చిన్న బుల్లి కోతికి తెలియదు కదా.. అదే అదే పనిగా ప్రయత్నించడం అందులో మనం చూడవచ్చు. నీటి పట్టుకోలేక పోతున్నా.. కోతి మాత్రం తన ప్రయత్నాలను ఆపదు.. అదే పనిగా ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ కోతి చేస్తున్న పని పెద్ద నీతి చెబుతున్నట్లుగా మనం గుర్తించవచ్చు. ఓటమి ఎన్నిసార్లు ఎదురైనా.. విజయం సాధించేవారు మనం పోరాడుతూనే ఉండాలి. నేటి తరం యువతకు ఈ కోతి చేసే పని పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది.

ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో చాలా మంది ఇష్టపడుతున్నారు. దీనిపై నెటిజన్లు తమాషాగా స్పందిస్తున్నారు. వీడియోపై వ్యాఖ్యానిస్తూ.. ‘అది నీటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది’ అని ఓ యూజర్ రాశారు. అదే సమయంలో, మరొక యూజర్ ‘ఆమె గందరగోళ రూపం అమూల్యమైనది’ అని రాశారు.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో మంకీండు యూనివర్స్ పేరుతో షేర్ చేయబడింది. ఈ అందమైన చిన్న వీడియోను ప్రజలు ఎంతగా ఇష్టపడుతున్నారో ఇప్పటి వరకు ఈ వీడియోకి 1 లక్ష 75 వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. వాస్తవాన్ని బట్టి అంచనా వేయవచ్చు.

ఇవి కూడా చదవండి: Sirivennela Sitarama Sastri: జగమంత కుటుంబం నాదీ.. ఏకాకి జీవితం నాది అంటూ గగనానికి సిరివెన్నెల..

Green Peas Benefits: బఠానీలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..