Viral Video: అయోధ్యలో అద్భుత దృశ్యం.. బాలరాముడి భక్తిలో నెమలి ఏం చేసిందో చూడండి..
అయోధ్య రామ భక్తులకు దివ్యదామాంగా మారింది. బాలరాముడిని దర్శించుకునే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రామభక్తిలో మనుషులే కాదు.. పశు పక్షులు కూడా మునిగి తేలుతుంటాయని విశ్వాసం. ఉడుత, జటాయువు అనే పక్షి వంటివి రాముడి కథలో తరచూ మనం వింటూనే ఉంటాం. ఇప్పుడు కూడా అలాంటి ప్రత్యేకమైన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. రామ భక్తిలో పరవశించి పోతున్న ఒక నెమలి వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది.

అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం కనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులకు ఇది కన్నుల పండుగల ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. ఇది చూసిన ప్రతి రామ భక్తుడు పరవశించిపోతున్నాడు. ఆ శ్రీరాముడు సాక్షాత్తు అయోధ్యలో జన్మించాడని నమ్ముతారు. అందుకే దీనిని రామ జన్మభూమి అంటారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, 2024 జనవరిలో జరిగిన ప్రాణప్రతిష్టాపన అనంతరం ఇది భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ఆలయంలో రాముడు రామ్ లల్లా’ (బాల రాముడు) రూపంలో పూజలందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అయోధ్యకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వేగంగా చక్కర్లు కొడుతోంది. అదేంటో మీరే చూడండి..
అయోధ్య రామ భక్తులకు దివ్యదామాంగా మారింది. బాలరాముడిని దర్శించుకునే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రామభక్తిలో మనుషులే కాదు.. పశు పక్షులు కూడా మునిగి తేలుతుంటాయని విశ్వాసం. ఉడుత, జటాయువు అనే పక్షి వంటివి రాముడి కథలో తరచూ మనం వింటూనే ఉంటాం. ఇప్పుడు కూడా అలాంటి ప్రత్యేకమైన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. రామ భక్తిలో పరవశించి పోతున్న ఒక నెమలి వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. అది చూసిన భక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. జంతువులు, పక్షులతో సహా మొత్తం విశ్వం భగవంతుని మహిమకు అతీతం అనడానికి ఈ వీడియో సాక్ష్యమిస్తుందంటూ చాలా మంది నెటిజన్లు వ్యాఖ్యనించారు.
అయోధ్య రామాలయంలో ఒక నెమలి ప్రత్యక్షమైంది. అది చేస్తున్న ఒక అద్భుతమైన భక్తి కార్యం కనిపించింది. ఈ ప్రత్యేకమైన దృశ్యం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో భక్తుల హృదయాన్ని కదిలించేదిగా ఉంది. అయోధ్య అద్భుతమైన ఆలయంలో రాముడిని చూడటానికి వేలాది మంది భక్తులు వేచి ఉన్నారు. అంతలోనే ఒక నెమలి ప్రశాంతంగా ఆలయంలోకి ప్రవేశిస్తుంది.
జనసమూహాన్ని చూసినప్పుడు నెమళ్ళు పారిపోవడం సర్వసాధారణం.. కానీ, ఈ నెమలి రాముడి అనుగ్రహం కోరుతూ విగ్రహం దగ్గరకు వెళ్తుంది. ఎంతో భక్తితో భగవంతుని పాదాల చెంత పూల మాలను సమర్పించింది. అవును, నెమలి తన ముక్కుతో పూలమాల పట్టుకుని బాలరాముడి ముందుకు కదులుతుంది. ముక్కుతో పూల దండను పట్టుకుని, దాని మెడను వంచి, భక్తి సంజ్ఞతో ఆ దండను భగవంతుడి ముందు సమర్పిస్తుంది. ఒక పక్షి ఇంత వినయంగా భగవంతుడికి తన కానుకను సమర్పించడాన్ని చూడటం అద్భుతం. నెమలి భక్తి ఆలయంలో ఉన్న ప్రతి భక్తుడి ఆశ్చర్యం, ఆనందాన్ని కలిగించింది.
నెమలి పూలమాల సమర్పించగానే, ఆలయ ప్రాంగణం మొత్తం జై శ్రీరామ్ నినాదాలతో ప్రతిధ్వనిస్తుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి అక్కడ ఉన్న ప్రజలు పూర్తిగా ఆశ్చర్యపోయి, భావోద్వేగానికి లోనవుతున్నట్లు వీడియోలో మనం చూడవచ్చు. కొందరు భక్తితో చేతులు జోడించి నమస్కరిస్తున్నారు. ఈ దివ్య క్షణాన్ని తమ హృదయాల్లో బంధించడానికి ప్రయత్నిస్తున్నారు. భారతీయ సంస్కృతిలో నెమలిని పవిత్రత, దైవత్వానికి చిహ్నంగా భావిస్తారు. ఒకప్పుడు శ్రీకృష్ణుని కిరీటంగా ఉన్న ఈ పక్షి నేడు రాముడి ఆస్థానంలో సేవలందిస్తోంద అంటూ చాలా మంది రామ భక్తులు కామెంట్ల రూపంలో స్పందించారు.
View this post on Instagram
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో చాలా మంది తమ అభిప్రాయాలను తెలియజేశారు. అయితే, కొందరు మాత్రం ఇది AI జనరేటేడ్ వీడియోగా చెబుతున్నారు. ఏది ఏమైనా వీడియో మాత్రం అందరి హృదయాలను కదిలిస్తోంది. దీనిని చూస్తున్న ప్రజలు, శ్రీరాముడు ప్రతి భక్తుడిపై తన ఆశీర్వాదాలను కురిపిస్తూనే ఉంటాడని, ప్రతి జీవి సేవను అంగీకరిస్తున్నాడని ఇది ప్రత్యక్ష సంకేతం అని చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




