Viral Video: ఎలుక కోసం పిల్లి-పాము భయంకరమైన ఫైటింగ్… చివరికి ఏం జరిగిందో చూడండి..!
డిసెంబర్ 30, మంగళవారం మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో పిల్లి, పాము మధ్య ఉత్కంఠభరితమైన పోరు సాగింది. వీధిలో పిల్లి, పాము పరస్పరం పోట్లాడుకున్నాయి. ఈ పోరాటంలో పామును పిల్లి మట్టుపెట్టింది. ఈ సంఘటన లాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఒక...

డిసెంబర్ 30, మంగళవారం మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో పిల్లి, పాము మధ్య ఉత్కంఠభరితమైన పోరు సాగింది. వీధిలో పిల్లి, పాము పరస్పరం పోట్లాడుకున్నాయి. ఈ పోరాటంలో పామును పిల్లి మట్టుపెట్టింది. ఈ సంఘటన లాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగింది. ఒక ఎలుక కోసం పిల్లి, పాము పరస్పర ఘర్షణ పడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియోలో పాము మొదట పిల్లిపైకి దూసుకెళ్లడం కనిపిస్తుంది. ఆ తర్వాత రెండు జీవులు దాదాపు 10 నిమిషాల పాటు పోరాడాయని స్థానికులు తెలిపారు. చివరికి పిల్లి వేగంగా స్పందిస్తూ పాముపై పంచ్‌లు వేసింది. నోటితో కరిచింది. పాము సైతం పిల్లిని కాటేసేందుకు బుసలు కొడుతూ ప్రయత్నించింది. కానీ, పాము కాటును పిల్లి చాకచక్యంగా తప్పించుకుంటూ ఎదురు దాడి చేయడం వీడియోలో కనిపిస్తుంది.
పాము, పిల్లిల పోరాటాన్ని స్థానికులు తమ మొబైల్ ఫోన్‌లలో రికార్డ్ చేసి, తర్వాత సోషల్ మీడియాలో షేర్ చేశారు. సోషల్ మీడియాలో లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. వేల మంది లైక్ చేశారు. పాము, పిల్లిల పోరాటంపై నెటిజన్స్ ఆసక్తికరంగా కామెంట్స్ పెడుతున్నారు.
వీడియో చూడండి:
बिल्ली की फुर्ती,सांप की सुस्ती.. यूपी प्रतापगढ़ लालगंज एक गांव में बिल्ली-सांप में भिडंत.जहरीला सांप नाली से निकल बिल की तरफ भागा।बिल्ली की नजर सांप पर पड़ी तो सांप ने हमला किया।आपस में भीड़त हुई,करीब 10 मिनट बाद बिल्ली ने सांप को मार डाला।ग्रामीण लाइव कमेंट्री करते रहें! pic.twitter.com/h6ywyPfWgx
— Tushar Rai (@tusharcrai) December 30, 2025
