Asteroid: ఆకాశం నుంచి పడిన ఉల్క.. పోలంలో చూసి షాకైన రైతు.. ఆ తర్వాత భయంతో..
Red Stone: మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని వశి తాలుకాలోని ఓ గ్రామంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఆకాశం నుంచి అరుదైన రాయి ఓ రైతు పొలంలో
Red Stone: మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని వశి తాలుకాలోని ఓ గ్రామంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఆకాశం నుంచి అరుదైన రాయి ఓ రైతు పొలంలో కింద పడింది. స్థానిక రైతు ప్రభు నివృతి మాలి ఎప్పటిలానే శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో పొలంలో కూరగాయలు తీసుకొచ్చేందుకు వెళ్లాడు. సరిగ్గా అదే సమయంలో ఈదురు గాలుల మధ్య భారీ శబ్దంతో ఓ రాయి ఆయనకు ఎనిమిది అడుగుల దూరంలో పడినట్లు రైతు వెల్లడించాడు.
భయంతో రైతు పరిశీలించగా.. రాయిని చూసి భయపడి.. వెంటనే తహసీల్దార్ నర్సింగ్ జాదవ్‌కు ప్రభు సమాచారం ఇచ్చారు. అధికారులు పొలం వద్దకు వచ్చి రాయిని పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. ఏడు అంగుళాల పొడవు, ఆరు అంగుళాల వెడల్పుతో ఉన్న ఈ రాయి బరువు 2.38 కేజీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తహసీల్దార్ కార్యాలయంలో ప్రాథమిక తనిఖీ పూర్తైన తర్వాత.. ఈ రాయిని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులకు పంపించినట్లు అధికారులు తెలిపారు. అయితే.. రంగును బట్టి కొందరు ఈ రాయిని బంగారు శిలగా పేర్కొంటున్నారు.
కాగా.. రాయి పడిన వెంటనే ఎవరో తనపై రాయి విసిరారని అనుకున్నానని రైతు పేర్కొన్నాడు. చుట్టు పక్కల చూడగా ఎవరూ కనిపించలేదని రైతు తెలిపాడు. మొదట భయపడి అనంతరం రాయిని తాకగా.. రాయి చల్లగా ఉందని.. ఆ తర్వాత అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపాడు. కాగా.. ఈ రాయిని పరిశీలించిన ఉస్మానాబాద్‌లోని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు.. ఇది ఒక ఉల్క అవేశేషం అని పేర్కొన్నారు. తోకచుక్క అవశేషాలు ఇలానే ఉంటాయని తెలిపారు.
Also Read: