AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఎంత ధైర్యం.. నా ఏరియాలోకి వస్తావా.. జేసీబీతో ఢీ అంటే ఢీ అంటున్న గజరాజు..!

అడవిని కాపాడుకునేందుకు ఏనుగు జేసీబీకి ఎదురుగా నిలబడిన దృశ్యం అంటూ ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అస్సాంకు చెందినదిగా ప్రచారం జరుగుతున్న ఈ వీడియోలో ఓ భారీ ఏనుగు, ఓ జేసీబీ యంత్రం ఎదురెదురుగా కనిపించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. కొందరు నెటిజన్లు ఈ వీడియోను ‘తన నివాసాన్ని కాపాడుకుంటున్న ఏనుగు’గా అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Viral Video: ఎంత ధైర్యం.. నా ఏరియాలోకి వస్తావా.. జేసీబీతో ఢీ అంటే ఢీ అంటున్న గజరాజు..!
Elephant In Front Jcb
Balaraju Goud
|

Updated on: Jul 16, 2026 | 8:51 PM

Share

అడవిని కాపాడుకునేందుకు ఏనుగు జేసీబీకి ఎదురుగా నిలబడిన దృశ్యం అంటూ ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అస్సాంకు చెందినదిగా ప్రచారం జరుగుతున్న ఈ వీడియోలో ఓ భారీ ఏనుగు, ఓ జేసీబీ యంత్రం ఎదురెదురుగా కనిపించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను @FalconUpdatesHQ అనే అకౌంట్ షేర్ చేసింది. వీడియోలో ఓ పచ్చని ప్రాంతం మధ్యలో ఏనుగు నిలబడి ఉండగా, దాని ఎదురుగా ఓ భారీ జేసీబీ యంత్రం కనిపించింది. యంత్రం ముందుకు కదులుతూ ఏనుగును పక్కకు జరిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఏనుగు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అక్కడే నిలబడి, తన తొండాన్ని పైకి ఎత్తి జేసీబీని ఎదుర్కొంటుంది.

ఈ ఆసక్తికరమైన దృశ్యాన్ని అక్కడున్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. ఏనుగు ధైర్యంగా యంత్రాన్ని ఎదుర్కొంటున్న తీరు చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు నెటిజన్లు ఈ వీడియోను ‘తన నివాసాన్ని కాపాడుకుంటున్న ఏనుగు’గా అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

అయితే ఈ ఘటనపై భిన్నమైన అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు, అడవులు, జంతువుల ఆవాస ప్రాంతాల్లో మానవ జోక్యం పెరగడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. జంతువుల నివాస ప్రాంతాలను ఆక్రమించే ముందు వాటి రక్షణ గురించి ఆలోచించాలని సూచించారు.

మరోవైపు, కొందరు వినియోగదారులు ఇది అస్సాంలోని టీ తోట ప్రాంతానికి సంబంధించిన ఘటన అయి ఉండవచ్చని తెలిపారు. ఏనుగు పంట ప్రాంతంలోకి రావడంతో దానిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు. మరికొందరు ఈ ఏనుగు తన గుంపు నుంచి విడిపోయి ఉండొచ్చని, దానిని తిరిగి అడవిలోకి పంపేందుకు ప్రయత్నాలు జరిగి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు, సంఘటన జరిగిన ప్రదేశం, సమయం అధికారికంగా వెల్లడికాలేదు. జంతువులు, మానవుల మధ్య పెరుగుతున్న ఘర్షణలకు ఈ వీడియో మరోసారి ఉదాహరణగా నిలిచింది. వన్యప్రాణుల సంరక్షణ, వాటి సహజ ఆవాసాల రక్షణ ఎంత ముఖ్యమో ఈ ఘటన గుర్తుచేస్తోంది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us