AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: నెలల పసికందుకు అమ్మగా మారిన ఆవు.. ఏం చేసిందో చూస్తే అవాక్కే..!

ఆవు తన పిల్లలను ఎంత ఆప్యాయంగా చూసుకుంటుందో తమ యజమాని పిల్లలను కూడా అంతే ఆప్యాయంగా చూస్తుంది. నవజాత శిశువు పట్ల ఆవు చూపించిన కరుణ ఇక్కడ వైరల్‌గా మారింది. ప్రముఖ ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేయబడిన ఈ వీడియోకి క్యాప్షన్‌గా నేటి అత్యంత అందమైన వీడియో అంటూ అభివర్ణించారు.

Watch: నెలల పసికందుకు అమ్మగా మారిన ఆవు.. ఏం చేసిందో చూస్తే అవాక్కే..!
Animal Bond
Jyothi Gadda
|

Updated on: Sep 21, 2024 | 6:28 PM

Share

చాలా మంది ఇళ్లలో కుక్కలు, పిల్లులు, మేకలు, ఆవులను పెంచుకుంటుంటారు. ఈ పెంపుడు జంతువులను ప్రజలు తమ కుటుంబ సభ్యులుగా ప్రేమిస్తారు. అవి కూడా తమ యజమానుల పట్ల అంతే విశ్వాసంతో ఉంటాయి. కుటుంబం ఆనందంలో ఉంటే.. వారితో పాటు సందడి చేస్తాయి. విచారంలో ఉంటే కన్నీళ్లు కారుస్తాయి. యజమానుల కోసం ప్రాణలర్పించిన కుక్కలు, పశువులకు సంబంధించిన వార్తలు గతంలో అనేకం చూశాం. అయితే, ఇక్కడ వైరల్‌ అవుతున్న ఇలాంటి ఘటన చాలా అరుదు. గతంలో మీరు ఎప్పుడూ చూడలేదు. వినలేదు కూడా. ఇది ఒక ఆవు విధేయతను చూపించే వీడియో. పూర్తి వివరాల్లోకి వెళితే..

పెంపుడు ఆవులు తమ యజమానికి అత్యంత ప్రియమైనవిగా ఉంటాయి. విధేయతతో మసలుకుంటాయి. ఆవు తన పిల్లలను ఎంత ఆప్యాయంగా చూసుకుంటుందో తమ యజమాని పిల్లలను కూడా అంతే ఆప్యాయంగా చూస్తుంది. నవజాత శిశువు పట్ల ఆవు చూపించిన కరుణ ఇక్కడ వైరల్‌గా మారింది. ప్రముఖ ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేయబడిన ఈ వీడియోకి క్యాప్షన్‌గా నేటి అత్యంత అందమైన వీడియో అంటూ అభివర్ణించారు.

ఇవి కూడా చదవండి

వైరల్‌ వీడియోలో ఒక ఆవు, దానికి దగ్గరగానే ఒక పసికందును పడుకోబెట్టి ఉండటం కనిపిస్తుంది. ఆ చిన్నారి ఏడుస్తూ కనిపించింది. అది చూసిన ఆవు తట్టుకోలేకపోయింది..పాపను పడుకోబెట్టిన దుప్పటితో సహా పసికందును దగ్గరకు లాక్కుంటుంది. అంతలోనే చిన్నారి తల్లి పాపను తన వైపుకు లాగుతుంది. కానీ, మరలా ఆవు తన వైపుకు లాగుతుంది. చిన్నారిని నాలుకతో తడుముతూ లాలించటం చేస్తుంది. ఆ ఆవు తన దూడను లాలించినట్లుగా పసికందును లాలిస్తోంది.

ఈ వీడియో చూడండి..

వేగంగా వైరల్‌ అవుతున్న ఈ వీడియో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్! అనే ఎక్స్‌ ఖాతాలో షేర్ చేయబడింది. కాగా, వీడియోకు 13 వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. 16 సెకన్ల నిడివి గల ఈ వీడియోపై వందలాది మంది స్పందించారు. కొందరు ఆవు ప్రేమను అభివర్ణిస్తుండగా, మరికొందరు ఆవు నుంచి పాపకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..