Watch: యముడు బ్రేక్ లో ఉన్నాడేమో.. జలపాతం అందాలు చూడాలనుకున్నాడు.. జస్ట్ మిస్
ఈ క్రమంలోనే అతని కాలు జారి అదుపు తప్పి ఒక కొండపై పడిపోయాడు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో చిన్నపాటి వర్షం కురిసింది. దాంతో అతడు ఆ కొండపై నుంచి అమాంతంగా కిందకు జారిపోయాడు. ఇక తాను బ్రతకటం కష్టమే.. ఎందుకంటే.. అతడు జారిపడిన కొండ ఎత్తు చూస్తేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయి.

సోషల్ మీడియాలో ఓ భయానక వీడియో వైరల్ అవుతోంది. ఆహ్లాదకరమైన జలపాతం అందాలు చూసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ఊహించని ప్రమాదంలో పడ్డాడు.. ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు తోటి పర్యాటకుల కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వేగంగా చక్కర్లు కొడుతోంది. చైనాలోని ప్రమాదకరమైన జలపాతం వద్దకు వెళ్లిన ఓ టూరిస్ట్ దాదాపు మరణం అంచుల దాకా వెళ్లిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 42 ఏళ్ల యాంగ్ మెంగ్ జారే అనే వ్యక్తి కొండపై నుంచి కిందకు పడిపోతున్న భయానక వీడియో ఇది. యాంగ్ మెంగ్ తన చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై ఈ వీడియోను షేర్ చేశారు. కాగా, దీనిని మిలియన్ల మంది ప్రజలు వీక్షించారు.
వైరల్ వీడియో కనిపించిన దృశ్యం షాంఘైకి పశ్చిమాన 280 మైళ్ల దూరంలో ఉన్న అన్‌హుయ్‌లోని ఫ్యాన్‌జెంగ్జియన్ పర్వత శ్రేణి.. ఇక్కడ తన ప్రయాణాన్ని షుట్ చేసేందుకు వెళ్లిన మెంగ్ 360-డిగ్రీ కెమెరాను ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతని కాలు జారి అదుపు తప్పి ఒక కొండపై పడిపోయాడు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో చిన్నపాటి వర్షం కురిసింది. దాంతో అతడు ఆ కొండపై నుంచి అమాంతంగా కిందకు జారిపోయాడు. ఇక తాను బ్రతకటం కష్టమేనని మెంగ్ నిర్ధారించుకున్నాడు.. ఆ క్షణంలో అతడు అనుభవించిన భయాన్ని మీడియాకు వెల్లడించాడు.
ఈ వీడియో చూడండి..
View this post on Instagram
జారిపోతున్న బండరాయి పై నుండి అతడు చాలా కిందకు పడిపోయాడు. అతని అదృష్టం బాగుంది.. తన కాలుకు ఓ చెట్టు తగిలింది. అతడి రెండు కాళ్లు ఆ చెట్టులో ఇరుక్కుపోవడంతో అతడు అతడు ఇంకా కిందకు జారిపోకుండా ఆగిపోయాడు. కెమెరా ఫుటేజీలో మెగ్ నిటారుగా ఉన్న వాలు నుండి పడి చెట్టును ఢీకొట్టిన దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. కిందపడటం వల్ల కాలికి స్వల్ప గాయాలు కాగా, చేయి, తొడపై చిన్నపాటి గీతలు పడ్డాయని మెంగ్ చెప్పాడు. అటువంటి భయంకరమైన ప్రమాదం నుండి అతను ప్రాణాలతో బయటపడటం నిజంగా అద్భుతం కంటే తక్కువ కాదు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వందలాది మంది ఈ వీడియోను షేర్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




