ముక్కు నుండి నిరంతరాయంగా నీళ్లు కారుతున్నాయంటూ యువకుడి ఫిర్యాదు.. షాకింగ్ విషయం చెప్పిన వైద్యులు
కానీ, చికిత్స చేయించుకోవడంలో నిర్లక్ష్యం చేశాడు. కానీ, కొన్ని రోజుల తర్వాత అతడు ముక్కు నుంచి నీళ్లు రావడం మొదలైంది. ఇటీవల వైద్యుడి వద్దకు వెళ్లినప్పుడు అతని మెదడు నుండి ద్రవం అతని పుర్రెలోని రంధ్రాల నుండి బయటకు పోతున్నట్లు గుర్తించారు. వైద్యులు దీనిని ట్రామాటిక్ ఎన్సెఫలోసెల్ అని పిలుస్తారు.

కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను విస్మరించటం ఖరీదైనదిగా మారుతుంది. సాధారణ సమస్యగా భావించిన అనారోగ్యం మనిషి ప్రాణం తీసిన ఘటనలు కూడా అనేకం వింటూనే ఉంటుంటాం. అటువంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ముక్కులో నుంచి నిరంతరాయంగా నీళ్లు వస్తుండటంతో అతడు డాక్టర్‌ని సంప్రదించాడు. సంబంధత టెస్టులు నిర్వహించిన అనంతరం షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిసింది. కేసు సిరియాకు చెందినది. పూర్తి వివరాల్లోకి వెళితే…
సిరియాకు చెందిన బాధితుడు 20 ఏళ్ల యువకుడు. అతడు తరచూ ముక్కు నుండి నీరు కారడంతో పాటు పదేపదే స్పృహ తప్పుతున్నాడు. తరచూ అతడు తీవ్రమైన తలనొప్పితో కూడా బాధపడుతున్నాడు. అయితే, గతంలో ఒకసారి అతని తలకు గాయమైనట్టుగా తెలిసింది. అప్పటి నుండి తను ఇలాంటి లక్షణాలను ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే డాక్టర్‌ని సంప్రదించగా..అతని ముక్కు నుండి నీరు రావడం జలుబు వల్ల కాదని, అది అతని మెదడు నుండి లీక్ అవుతుందని చెప్పారు.
జర్నల్ ఆఫ్ మెడికల్ కేస్ రిపోర్ట్స్ ప్రకారం, ద్రవం మెదడు, వెన్నుపామును రక్షించే ద్రవం. దీనిని సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్ (CSF) అని పిలుస్తారు. ఈ రకమైన సమస్య తరచుగా పుట్టినప్పటి నుండి ప్రజలలో కనిపిస్తుంది. 10,400 మంది పిల్లలలో ఒకరిలో మాత్రమే ప్రభావితం చేస్తుంది. కానీ, ఈ రోగికి చిన్నప్పటి నుంచి ఈ సమస్య లేదు. ఆరేళ్ల క్రితం తనకు ప్రమాదం జరిగిందని, అందులో తలకు గాయమైందని ఆ వ్యక్తి చెప్పాడు. కానీ, చికిత్స చేయించుకోవడంలో నిర్లక్ష్యం చేశాడు. కానీ, కొన్ని రోజుల తర్వాత అతడు ముక్కు నుంచి నీళ్లు రావడం మొదలైంది. ఇటీవల వైద్యుడి వద్దకు వెళ్లినప్పుడు అతని మెదడు నుండి ద్రవం అతని పుర్రెలోని రంధ్రాల నుండి బయటకు పోతున్నట్లు గుర్తించారు. వైద్యులు దీనిని ట్రామాటిక్ ఎన్సెఫలోసెల్ అని పిలుస్తారు.
MRI రిపోర్ట్స్‌లో అతని పుర్రెలో ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేయాలని చెప్పగా రోగి నిరాకరించాడు. కానీ, ఒక నెల తర్వాత అతను మళ్లీ తిరిగి వచ్చి సర్జరీ చేయమని అడిగాడు. వైద్యులు అతని పుర్రెకు ఆపరేషన్ చేసి సమస్యను పరిష్కరించారు. శస్త్రచికిత్స తర్వాత రోగి ఎటువంటి సమస్యలు లేకుండా కోలుకున్నాడని తెలిసింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




