Anant Ambani: మరోసారి నెటిజన్ల హృదయాన్ని గెలుచుకున్న అనంత్ అంబానీ.. వీడియో వైరల్..
అనంత్ సౌమ్య స్వభావం సోషల్ మీడియాలో ప్రజల హృదయాలను గెలుచుకుంటుంది. ఆయన సింప్లిసిటీ, వినయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా మంది వినియోగదారులు అతని పెంపకాన్ని ప్రశంసించారు. ఇంత గొప్ప వ్యక్తిలో ఇంత సరళతను చూడలేదని చెప్పారు. ఒక వ్యక్తి అనంత్‌ను తన 'ఇష్టమైన అంబానీ'గా అభివర్ణించాడు.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల పెళ్లి వేడుకలు, హనీమూన్ ట్రిప్ గురించి సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ జంట జూలై 12 న వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఫ్రాన్స్‌లో హనీమూన్‌లో ఉన్నారు. ఇటీవల ఈ జంటకు సంబంధించిన అనేక చిత్రాలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఇందులో వారిద్దరూ వీధుల్లో తిరుగుతూ తమ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
వైరల్ అయిన తాజా వీడియోలో అనంత్ అంబానీ తన కారు నుండి బయటకు వచ్చి అభిమానులను నవ్వుతూ పలకరిస్తున్నట్లు కనిపించాడు. ఈ సమయంలో కొంతమంది యువకులు అనంత్ తో సేల్ఫీ దిగడానికి ఉత్సాహం చూపగా సంతోషంగా సెల్ఫీ తీసుకోవడానికి అంగీకరించాడు. అయితే అనంత్ అంగరక్షకులు అభిమానులు అతడి దగ్గరికి రాకుండా చూసుకున్నారు. మీరు ఫ్రెంచ్ మాట్లాడతారా అని అనంత్‌ను అడగ్గా.. ‘లేదు’ అని సమాధానం ఇచ్చాడు. చిరునవ్వుతో ‘బోంజర్’ అని అభిమానులకు స్వాగతం పలికాడు. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు చేసిన ఈ చిన్న సంజ్ఞ అభిమానుల హృదయాలను కలిచివేసింది.
ప్రజల హృదయాలను గెలుచుకున్న అనంత్ అంబానీ వీడియోను ఇక్కడ చూడండి
View this post on Instagram
అనంత్ సౌమ్య స్వభావం సోషల్ మీడియాలో ప్రజల హృదయాలను గెలుచుకుంటుంది. ఆయన సింప్లిసిటీ, వినయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా మంది వినియోగదారులు అతని పెంపకాన్ని ప్రశంసించారు. ఇంత గొప్ప వ్యక్తిలో ఇంత సరళతను చూడలేదని చెప్పారు. ఒక వ్యక్తి అనంత్‌ను తన ‘ఇష్టమైన అంబానీ’గా అభివర్ణించాడు. అతని స్వభావంలో అతనికి ఎటువంటి వైఖరి లేదని, చాలా మర్యాదగా ఉందని కామెంట్ చేశాడు.
ముఖేష్ అంబానీ పిల్లలు ఆసియాలోనే అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన వారని.. అయితే చాలా సంస్కారవంతులు, మర్యాదపూర్వకంగా, గౌరవప్రదంగా ఉంటారని ఈ ఘటన మరోసారి రుజువు చేసిందని అంటున్నారు. అనంత్‌కు ఉన్న సింప్లిసిటీ, ఫ్యాన్స్ పట్ల ఉన్న గౌరవం వల్ల జనాల గుండెల్లో అనంత్ పై గౌరవం మరింత పెరిగేలా చేసిందని వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..