Viral: కడుపునొప్పితో ఆస్పత్రికెళ్లాడు.. తీరా ఎక్స్‌రే చూసి కళ్లు తేలేసిన డాక్టర్లు..
మనం అప్పుడప్పుడూ పలు రకాల అరుదైన మెడికల్ కేసులు గురించి వినే ఉంటాం. వాటి గురించి తెలుసుకున్నప్పుడల్లా ఆశ్చర్యపోవడం ఖాయం. తాజాగా ఇలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది.
మనం అప్పుడప్పుడూ పలు రకాల అరుదైన మెడికల్ కేసులు గురించి వినే ఉంటాం. వాటి గురించి తెలుసుకున్నప్పుడల్లా ఆశ్చర్యపోవడం ఖాయం. తాజాగా ఇలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి పేగుల నుంచి బ్రతికున్న ఈల్‌ను బయటకు తీశారు వైద్యులు. ఈ సంఘటన వియత్నాంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. 34 ఏళ్ల వ్యక్తి ఒకరు తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చాడు. అక్కడున్న డాక్టర్లు అల్ట్రాసౌండ్ సాయంతో పరిస్థితిని అంచనా వేశారు. సదరు వ్యక్తి పరిస్థితి విషమించడంతో.. వైద్యులు హుటాహుటిన ఆపరేషన్ చేశారు. అతడికి పునర్జన్మను ఇచ్చారు.
ఈల్ ఎంత పెద్దది.?
ఆడిటీ సెంట్రల్ వెబ్‌సైట్ ప్రకారం, ఎక్స్-రేను చూసిన డాక్టర్లు దెబ్బకు కంగుతిన్నారు. సుమారు 32 సెంటీమీటర్ల పొడవాటి ఈల్ మనిషి కడుపులో ఇరుక్కుపోయిందని గుర్తించారు. అది అతని మలద్వారం ద్వారా శరీరంలోకి ప్రవేశించి.. పేగుల దాకా చేరిందని వైద్యులు అంచనా వేశారు. మొదటిగా ఎండోస్కోపీ ద్వారా ఈల్‌ను తొలగించాలని వైద్యులు ప్రయత్నించినా.. అది సాధ్యం కాలేదు. రోగికి నొప్పి విపరీతం కావడంతో.. కడుపునకు శస్త్రచికిత్స చేసి బయటకు తీశారు. సుమారు 65 సెంటీమీటర్ల పొడవు, 10 సెంటీమీటర్ల మందం ఉన్న ఈల్‌ను డాక్టర్లు తొలగించారు. బాధితుడికి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని.. అనంతరం పేషెంట్ ఆరోగ్యంగా ఉన్నట్టు డాక్టర్లు తేల్చారు.