సైకిల్ చక్రాలు రౌండ్‌గానే ఉండాలా.? వైరల్ వీడియోపై ఆనంద్ మహీంద్ర ఫన్నీ రియాక్షన్
వివరాళ్లోకి వెళితే.. సాధారణంగా సైకిల్ చక్రాలు ఎలా ఆకారంలో ఉంటాయి.? అదేం ప్రశ్న ముమ్మాటికీ రౌండ్ షేప్‌లో ఉంటాయని చెబుతారు కదూ! నిజమే ప్రతీ వాహన టైర్స్ రౌండ్ షేప్‌లోనే ఉంటాయి. ఆదిమానవుడు సాధించిన గొప్ప విషయాల్లో ఇదీ ఒకటి. వృత్తాకారాన్ని తయారు చేయడం ద్వారానే ప్రయాణ సాధానాలకు బీజం పడింది. అయితే టైర్లు గుండ్రంగానే ఎందుకు ఉండాలనుకున్నారో ఏమో..

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారిలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర మొదటి వరుసలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సమాజంలో జరిగే అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. వినూత్నంగా కనిపించే ప్రతీ అంశాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు. అంతటితో ఆగకుండా ఆ వీడియోలకు ఫన్నీ కొటేషన్స్ కూడా ఇస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్ర చేసిన ఇలాంటి ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
వివరాళ్లోకి వెళితే.. సాధారణంగా సైకిల్ చక్రాలు ఎలా ఆకారంలో ఉంటాయి.? అదేం ప్రశ్న ముమ్మాటికీ రౌండ్ షేప్‌లో ఉంటాయని చెబుతారు కదూ! నిజమే ప్రతీ వాహన టైర్స్ రౌండ్ షేప్‌లోనే ఉంటాయి. ఆదిమానవుడు సాధించిన గొప్ప విషయాల్లో ఇదీ ఒకటి. వృత్తాకారాన్ని తయారు చేయడం ద్వారానే ప్రయాణ సాధానాలకు బీజం పడింది. అయితే టైర్లు గుండ్రంగానే ఎందుకు ఉండాలనుకున్నారో ఏమో.. ఓ సైకిల్ కంపెనీ చతురస్రాకరంలో టైర్లను రూపొందించింది.
ఆనంద్ మహీంద్ర ట్వీట్..
I have only ONE question: “WHY??” pic.twitter.com/YopuctOsve
— anand mahindra (@anandmahindra) December 28, 2023
అయితే ఆ స్క్వేర్ షేప్ చుట్టూ టైర్‌ను ఏర్పాటు చేశారు. సైకిల్‌ని తొక్కుతుంటూ టైర్ స్క్వేర్ షేప్ చుట్టూ తిరుగుతూ సైకిల్ ముందుకు వెళ్తుంది. ఈ సైకిల్‌కు సంబంధించిన వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఆనంద్ మహీంద్ర కంటపడడంతో ఈ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. వీడియోతో పాటు.. ‘నాకు ఒకటే సందేహం ఉంది.? ఇలా ఎందుకు’ అంటూ రాసుకొచ్చారు. సైకిల్ టైర్‌ను స్క్వేర్ షేప్‌లో డిజైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న అర్థం వచ్చేలా ఆనంద్ మహీంద్ర చేసిన ట్వీట్ నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. మరి సైకిల్ టైర్లను ఇలా ఎందుకు డిజైన్ చేశారో సదరు కంపెనీకే తెలియాలి.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..