AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Duologue with Barun Das S3: మనసులోని భావాలను పంచుకున్న ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురుదేవ్ శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌

Duologue with Barun Das S3: మనసులోని భావాలను పంచుకున్న ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురుదేవ్ శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌

Balaraju Goud
|

Updated on: Mar 22, 2025 | 6:36 PM

Share

మన గురించి.. మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి సత్యాన్ని చేరుకోవడం ఉత్తమం. టీవీ9 నెట్‌వర్క్‌ ఎండీ బరుణ్‌దాస్‌ నిర్వహిస్తున్న న్యూస్‌9లో నిర్వహిస్తున్న డ్యుయోలాగ్‌ విత్‌ బరుణ్‌దాస్‌ పోగ్రామ్‌లో విశిష్ట అతిధులు పాల్గొంటున్నారు. మార్చి 22 శనివారం ప్రసారమయ్యే డ్యుయోలాగ్‌ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురు శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌ విలువైన అభిప్రాయాలను పంచుకుంటారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న మార్పుల గురించి తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ తప్పనిసరి వీక్షించండి.

టీవీ9 న్యూస్‌ నెట్‌వర్క్‌కు చెందిన ఇంగ్లీష్‌ ఛానెల్‌ న్యూస్‌9 ప్రేక్షకులను వినూత్న కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. టీవీ9 నెట్‌వర్క్‌ ఎండీ బరుణ్‌దాస్‌ నిర్వహిస్తున్న న్యూస్‌9లో నిర్వహిస్తున్న డ్యుయోలాగ్‌ విత్‌ బరుణ్‌దాస్‌ పోగ్రామ్‌లో విశిష్ట అతిధులు పాల్గొంటున్నారు. శనివారం(మార్చి 22) రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే డ్యుయోలాగ్‌ కార్యక్రమంలో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురు శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌ విలువైన అభిప్రాయాలను పంచుకుంటారు. ఆదివారం(మార్చి 23) ఉదయం 10 గంటలకు మళ్లీ ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం చూసేందుకు మీ కేబుల్‌ ఆపరేటర్‌ను న్యూస్9 ఛానెల్‌ కోసం అడగండి.. మిస్సయితే న్యూస్‌9 యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని చూడండి..

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురుదేవ్‌ శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌ గురించి ఇంట్రడక్షన్‌ అవసరం లేదు.. అధ్యాత్మికతకు మానవతా విలువను జోడించి ప్రపంచవ్యాప్తంగా స్వచ్చంధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రపంచశాంతికి ఆయన ఎనలేని కృషి చేస్తున్నారు. గురుదేవ్‌ రవిశంకర్‌ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. గురుదేవ్‌ విలువైన అభిప్రాయాలను న్యూస్‌9 ఛానెల్‌ డ్యుయోలాగ్‌ కార్యక్రమంలో పంచుకున్నారు. న్యూస్‌9లో ఇవాళ రాత్రి 10 గంటలకు , మళ్లీ రేపు ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది.

దేశంలో నెంబర్‌వన్‌ న్యూస్‌ నెట్‌వర్క్‌ టీవీ9 ఇంగ్లీష్‌ న్యూస్‌ ఛానెల్‌ న్యూస్‌9కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ఎన్నో అంశాలను న్యూస్9 ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. న్యూస్‌9లో టీవీ9 నెట్‌వర్క్‌ ఎండీ బరుణ్‌దాస్‌ స్వయంగా నిర్వహిస్తున్న డ్యుయోలాగ్‌ విత్‌ బరుణ్‌దాస్‌ పోగ్రామ్‌లో విశిష్ట అతిథులు తమ విలువైన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మీ కేబుల్‌ ఆపరేటర్‌ను న్యూస్9 ఛానెల్‌ కోసం అడగండి.. మిస్సయితే న్యూస్‌9 యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి. యాప్‌లో మీరు కేవలం ఈ కార్యక్రమాన్ని మాత్రమే కాదు.. అపర్ణాసేన్‌, కిరణ్‌రావు, విశ్వనాథన్‌ ఆనంద్‌ లాంటి సెలబ్రిటీల డ్యుయోలాగ్‌ కార్యక్రమాలను కూడా చూడవచ్చు.

మతం గురిచి , మానవత్వం గురించి శ్రీ శ్రీ శ్రీ రవిశంకర్‌ డ్యుయోలాగ్‌ విత్‌ బరుణ్‌దాస్‌ పోగ్రామ్‌లో చాలా స్పష్టత ఇచ్చారు. ‘‘గురుదేవ్‌ మతం విషయానికొస్తే.. నేను హిందువుగా జన్మించినప్పటికి .. మీరు అన్ని మతాలకు ప్రాతినిధ్య వహించాలని కొందరు చెబుతారు. నేను ఆచరించే మతంలో రెండు కోణాలు ఉంటాయి. మొదట నా విధులను సరైన రీతిలో నిర్వహించడం.. రెండోది బతుకు.. బతికించు అనే సిద్దాంతానికి కట్టుబడి ఉంటా.. సరైన జీవన విధానం విషయంలో ఇంకా ఏదైనా మిస్‌ అయ్యానా ? ’’ అని గుర్తు చేసుకుంటానని రవిశంకర్ పేర్కొన్నారు. చాలా మంది మన మతం గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం.. విదేశాలకు వెళ్లగానే జనం పేర్లను మార్చుకుంటున్నారు. కృష్ణ అక్కడ క్రిస్‌ అవుతున్నారని రవిశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్రీయ దృక్పథం అవసరం.. మన దగ్గర యోగా , ఆయుర్వేద లాంటి అద్భుత విద్యలు ఉన్నాయి.. కాని వాటికి సరైన అక్షరరూపం లేదు. వాటికి మనం అక్షర రూపం ఇస్తే ప్రపంచం తప్పకుండా అనుసరిస్తుందని రవిశంకర్ అన్నారు.

ఇలా మతం, మానవత్వంతో పాటు అధ్యాత్మికత, యుద్దం.. సంక్షోభాల గురించి డ్యుయోలాగ్‌ విత్‌ బరుణ్‌దాస్‌ పోగ్రామ్‌లో చాలా స్పష్టత ఇచ్చారు గురుదేవ్‌ రవిశంకర్‌. ఈ కార్యక్రమం చూసేందుకు మీ కేబుల్‌ ఆపరేటర్‌ను న్యూస్9 ఛానెల్‌ కోసం అడగండి… మిస్సయితే న్యూస్‌9 యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Published on: Mar 22, 2025 06:26 PM