RC16: క్యాన్సర్ నుంచి కోలుకున్న శివన్న.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో షూటింగ్ కు రెడీ
ఇటీవల క్యాన్సర్ నుంచి కోలుకున్న శివన్న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లిని దర్శించుకుని తన భార్యతో కలిసి పూజలు చేశారు. అమ్మవారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. తాజాగా రామ్ చరణ్ నటిస్తోన్న ‘ఆర్‌సీ 16 సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు భాగ్యనగరానికి చేరుకున్నాడు శివన్న. ఒక్కసారిగా శివన్నను చూడడంతో ఆలయంలో సందడి నెలకొంది. శివన్నతో సేల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు.

ఇటీవల క్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ RC 16 సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ రోజు ఉదయం పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నాడు. శివ రాజ్ కుమార్ సతీసమేతంగా పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ సిబ్బంది శివ రాజ్ కుమార్ దంపతులకు అమ్మవారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. శివ రాజ్ కుమార్ ని చూసిన భక్త గణం, శివన్న అభిమానులు ఆయనతో సేల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. దీంతో అక్కడ ఓ రేంజ్ లో సందడి నెలకొంది.
క్యాన్సర్ నుంచి కోలుకున్న శివన్న మళ్ళీ సినిమాలకు ఒకే చెబుతున్నారు. తాజాగా హీరో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న RC 16లో ఓ కీలక పాత్రలో శివన్న నటిస్తున్నాడు. ఇప్పటికే లుక్ టెస్ట్ ముగించుకున్న ఆయన ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుపుకుంటుంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ క్రీడాకారుడిగా నటిస్తున్నాడు. ధోనీ గురువుగా నటించనున్నాడు అనే వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో చరణ్ కు అందాల సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వి కపూర్ నటిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జగపతి బాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Look test done ✅ A terrific look locked 🔒
Karunada Chakravarthy @NimmaShivanna Garu will soon join the sets of #RC16 and begin shooting for his role ❤️🔥#RamCharanRevolts Global Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop… pic.twitter.com/nPuECCiyFV
— Vriddhi Cinemas (@vriddhicinemas) March 5, 2025
గతేడాది బ్లాడర్ క్యాన్సర్ బారిన పడిన శివ రాజ్‌కుమార్ క్యాన్సర్‌పై పోరాడి.. గెలుపొందిన సంగతి తెలిసిందే. అమెరికాలోని మయామి క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స తీసుకున్న ఆయన క్యాన్సర్ నుంచి కోలుకున్నారు. శివన్న క్యాన్సర్‌ని జయించేందుకు చేసిన స్ఫూర్తిదాయక పోరాటాన్ని డాక్యుమెంటరీ రూపంలో తీసుకురాబోతున్నట్లు శివన్న భార్య గీతా శివరాజ్‌కుమార్ ఇప్పటికే ప్రకటించారు.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..