AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: భోజనం చేసే విషయంలో ఈ తప్పులు పారబాటున కూడా చేయకండి..!

వాస్తు శాస్త్రం మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించింది. ఇంటి నిర్మాణం, ఇంట్లో ఉన్న వస్తువులు వంటి వాటిని మాత్రమే కాదు తినే ఆహారం ఎలా ఏ విధంగా తినాలి అంటూ ఆహార వినియోగానానికి సంబందించిన విషయాలను కూడా వివరించింది. ఆహారం తినేటందుకు కొన్ని దిశలను వివరించింది. ఈ వాస్తు నియమాలకు అనుగుణంగా ఆహారం తినడం వల్ల ఆరోగ్యం, శరీరంపై కూడా ప్రభావం చూపిస్తుంది. సరైన దిశలో కూర్చుని తినడం వల్ల శాంతి, విజయం, ఆరోగ్యం లభిస్తాయని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు.

Vastu Tips: భోజనం చేసే విషయంలో ఈ తప్పులు పారబాటున కూడా చేయకండి..!
Vastu Tips For Dining
Surya Kala
| Edited By: |

Updated on: Mar 22, 2025 | 4:57 PM

Share

వాస్తు శాస్త్ర నియమాలను పాటించడం వల్ల ఇంటిలో ఎల్లప్పుడూ శాంతి ఉంటుంది. ఆ ఇంట్లో నివసించే వారు ప్రశాంతంగా జీవిస్తారని నమ్ముతారు. కనుక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎక్కడ కూర్చుని తినాలో కూడా ప్రస్తావన ఉంది. జీవితంలో పురోగతి , విజయం కావాలంటే.. ఎవరైనా సరైన దిశలో కూర్చొని ఆహారం తినాలి. ప్రతి దిశలో వివిధ రకాల శక్తి ప్రవాహాలు ఉంటాయి. కనుక సరైన దిశలో కూర్చుని భోజనం చేస్తే.. అక్కడి శక్తి శరీరానికి మేలు చేస్తుంది.

తూర్పు ముఖంగా భోజనం చేయడం: తూర్పు ముఖంగా భోజనం చేయడం వల్ల మెదడుకు మంచిది. ఇది జీర్ణవ్యవస్థను బలంగా ఉంచుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇలా ఈ దిశలో తినడం వృద్ధులకు, రోగులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. తరచుగా కడుపు సమస్యలు ఉన్నవారు తూర్పు దిశలో కూర్చుని తినాలి.

పశ్చిమం వైపు తిరిగి భోజనం చేయడం: పశ్చిమ దిశను లాభ దిశ అంటారు. ఈ దిశలో కూర్చుని తినడం వల్ల పురోగతికి మార్గం సుగమం అవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ దిశ వ్యాపారం, పని, రచన, పరిశోధన, విద్యకు సంబంధించిన వ్యక్తులకు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

ఉత్తర దిశ: ఉత్తర దిశను సంపద, జ్ఞానానికి సంబంధించిన దిశగా పరిగణిస్తారు. ఈ దిశలో కూర్చుని తినడం బుద్ధికి మంచిది. విజయానికి దారి తీస్తుంది. యువకులు, విద్యార్థులు భోజనం చేసేటప్పుడు ఉత్తర దిశలో కూర్చోవాలి.

ఈ దిశలో కూర్చుని తినకూడదు: వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిశ యమ ధర్మ రాజు (మృత్యుదేవత) దిశ. యముడుకి సంబందించిన దిశకు ఎదురుగా కూర్చుని తినడం వల్ల ప్రతికూల శక్తి వస్తుంది. అంతేకాదు పేదరికానికి దారితీస్తుంది. కుటుంబంలో వివాదాలు పెరుగుతాయి. పురోగతికి ఆటంకం ఏర్పడుతుంది. తల్లిదండ్రులున్నావారు ఈ దిశలో కూర్చుని తినే అలవాటుకి వెంటనే స్వస్తి చెప్పండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us