కొడుకు పుట్టాలనే కోరికతో ఏకంగా 9 మంది ఆడపిల్లలకు జన్మనిచ్చిన మహిళ.. వారి పేర్లు వింటే నోరెళ్ల బెడతారు..
మీరు కోరుకునే పిల్లలు పుట్టడం చాలా అరుదు. అమ్మాయిని కోరుకునే వారికి అబ్బాయి. అబ్బాయిని కోరుకునే వారికి అమ్మాయి పుట్టడం చాలా సందర్భాల్లో చూస్తుంటాం..అయినప్పటికీ ఏ బిడ్డ పుట్టినా, ఆ తల్లిదండ్రులు వారిని సంతోషంగా పెంచుకుంటారు. కానీ, కొందరు ఆడపిల్ల పుట్టిందని బాధ, చులకన భావాన్ని ప్రదర్శిస్తుంటారు. అలాగే, మరికొందరు అబ్బాయి కోసం ఎంతమంది ఆడపిల్లలు పుట్టినా ఎదురు చూస్తూనే ఉంటారు. అలా మగపిల్లవాడి కోసం ఎదురు చూసిన ఓ జంట ఏకంగా తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చారు. అంతేకాదు.. వారికి వింతైన పేర్లు పెట్టడం ద్వారా ప్రస్తుతం వార్తల్లో నిలిచారు.

మగ బిడ్డ పుట్టాలనే ఆశతో ముగ్గురు లేదా నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చిన జంటలు చాలా మంది ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆడపిల్లలకు అబ్బాయిలతో సమానమైన గుర్తింపు లభిస్తోంది. అయినప్పటికీ కొంతమంది తమకు మగబిడ్డ కావాలని తాపత్రయపడుతుంటారు. అలాంటిదే ఈ జంట కథ కూడా.. ఏకంగా 9 మంది అమ్మాయిలకు జన్మనిచ్చిన ఓ తల్లిదండ్రులు అబ్బాయి కోసం ఎదురు చూసిన కోరికతో సోషల్ మీడియా వేదికగా అందరి దృష్టిని ఆకర్షించారు. మగపిల్లవాడిని కోరుకున్న ఈ చైనీస్ జంట ఒకరి తర్వాత ఒకరు పిల్లలను కన్నారు. కానీ, ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే, ఆ తండ్రి తనకు పుట్టిన కూతుళ్లందరికీ వింతైన పేర్లు పెట్టాడు. ప్రతి పేరులో “డి” అనే చైనీస్ అక్షరం ఉండేలా వారికి విచిత్రమైన పేర్లు పెట్టాడు. ఆ పేర్ల వెనుక అర్థం ఆ జంటకు మగపిల్లవాడు కావాలనే బలమైన కోరికను సూచిస్తున్నాయి. ఈ వార్త చైనా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ 9 మంది అక్కా చెల్లెల్లు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని హువాయ్ యాన్‌లో జన్మించారు. వారి వయసు 20ఏళ్ల లోపుగానే. అతని తండ్రికి ఇప్పుడు 81 సంవత్సరాలు. తండ్రి పేరు జి. అతను తన కూతుళ్లకు D తో ముగిసే పేర్లతో పేర్లు పెట్టాడు. అమ్మాయిలకు ఇలాంటి పేర్లను అతడు ఎంతో జాగ్రత్తగా ఏరి కోరి పెట్టాడు. వారి పేర్ల అర్థాలను చూస్తేనే ఆ జంట మగబిడ్డను ఎంతగా కోరుకున్నారో అర్థమవుతుంది.
ఆ అమ్మాయిల పేర్లు ఇలా ఉన్నాయి: జి తన 9 మంది కూతుళ్లకు పెట్టిన పేర్లు, వాటి అర్థాలు ఇక్కడ ఉన్నాయి. పెద్ద కూతురి పేరు ఝావోడి. ఆమె వయసు దాదాపు 60 సంవత్సరాలు. ఝావోడి అంటే సోదరుడికి విజ్ఞప్తి. రెండవ కూతురి పేరు పాండి. పాండి తన తమ్ముడి కోసం ఎదురు చూస్తున్నాడని అర్థం. అతను తన మూడవ కూతురికి జీ వాంగ్డి అని పేరు పెట్టాడు. వాంగ్డి అంటే సోదరుడి కోసం ఎదురుచూడటం. జి తన నాల్గవ బిడ్డకు జియాంగ్డి అని పేరు పెట్టాడు. దీని అర్థం తన సోదరుడి గురించి ఆలోచించడం. జి తన ఐదవ కూతురికి లిడీ అని పేరు పెట్టాడు. లిడీ తన సోదరుడు వస్తున్నాడని అర్థం. అతను తన ఆరవ బిడ్డకు యింగ్డి అని పేరు పెట్టాడు. యింగ్డి అంటే సోదరుడి కోసం స్వాగతం అని అర్థం. జీ తన ఏడవ బిడ్డకు నియాండి అని పేరు పెట్టారు. అంటే నాకు నా సోదరుడు గుర్తుకు వస్తున్నాడని అర్థం. అతను తన ఎనిమిదవ కుమార్తెకు చౌడీ అని పేరు పెట్టాడు. చౌడీ అంటే సోదరుడిని ద్వేషించడం. అతను తన చివరి కుమార్తెకు జీ మెంగ్డి అని పేరు పెట్టాడు. దీని అర్థం సోదరుడు తన కల అని అంటారు. కానీ, పాపం..జి, అతని భార్యకు మగబిడ్డ పుట్టడం ఒక కలగానే మిగిలిపోయింది.
భారతదేశం లాగే చైనాలో కూడా మగ బిడ్డ తమను వృద్ధాప్యంలో చూసుకుంటాడని నమ్ముతారు. ఈ జంట కూడా అలానే అబ్బాయి కోసం ఎదురు చూసింది. కుమార్తెలు వివాహం చేసుకుని భర్త ఇంటికి వెళ్లిపోతారు కాబట్టి, వారిని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక కొడుకు కావాలని కోరుకున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..