Viral News: భాగస్వామి అవసరం లేకుండానే గర్భం దాల్చిన యువతి.. రూ. 4 వేల ఖర్చుతో ఇంట్లోనే కృత్రిమ గర్భదారణ..
Viral News: శాస్త్రసాంకేతికంగా అనూహ్య మార్పులు వస్తున్నాయి. రోజురోజుకీ సాంకేతికంగా మనిషి అభివృద్ధి చెందుతున్నాడు. దేవుడి చేసిన సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాడు. మనిషి పుట్టుక, చావు ఈ రెండు...
Viral News: శాస్త్రసాంకేతికంగా అనూహ్య మార్పులు వస్తున్నాయి. రోజురోజుకీ సాంకేతికంగా మనిషి అభివృద్ధి చెందుతున్నాడు. దేవుడి చేసిన సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాడు. మనిషి పుట్టుక, చావు ఈ రెండు దేవుడి పనేనని నమ్మేవాళ్లు మనలో చాలా మంది ఉంటారు. ఒక మనిషి భూమి మీదికి రావాలంటే ఆడ, మగ కలయిక అనివార్యం అయితే టెక్నాలజీ దీనిని కూడా మార్చేసింది. శారీరకంగా కలవకపోయినా కృత్రిమ మార్గంలో గర్భం దాల్చే విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇన్‌వివో ఫెర్టిలైజేషన్‌గా పిలిచే ఈ విధానం ద్వారా మహి గర్భాశయ కుహరంలోకి వీర్యాన్ని పంపించడం ద్వారా గర్భం దాల్చేలా చేయొచ్చు.
ఇది ఇప్పటికే అందుబాటులో ఉంది. అయితే దీనిని నిపుణులైన వైద్యులు మాత్రమే చేస్తారు. అందులోనూ ఖర్చుతో కూడుకున్న విషయం. అయితే ఓ మహిళ మాత్రం ఎవరి సహాయం లేకుండానే కేవలం రూ. 4 వేల ఖర్చుతోనే కృత్రిమంగా గర్భదారణ దాల్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకీ ఎవరా మహిళ.. తనకు ఇది ఎలా సాధ్యమైందని తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
అమెరికాకు చెందిన 24 ఏళ్ల బెయిలీ ఎన్నిస్ అనే మహిళ తల్లి కావాలని ఎన్నో రోజులుగా ఆరాటపడుతోంది. అయితే మగతోడు అవసరం లేదనే మనస్తత్వంతో ఉన్న బెయిలీ పిల్లలని మాత్రం కోరుకుంటోంది. ఇందు కోసం వైద్యుల సహకారం లేకుండా డీఐవై కిట్‌తో ఇంట్లోనే కృత్రిమ గర్భదారణ పొందింది. అంతేకాదు జూలైలో 2.32 కిలోల బరువున్న మగబిడ్డకు జన్మిచ్చి అందరినీ షాక్‌కి గురి చేసింది. నిజానికి ఈ ప్రక్రియకు తక్కువలో తక్కువ మన కరెన్సీలో రూ. 80 వేలు అయినా ఖర్చవుతాయి కానీ సదరు మహిళ కేవలం రూ. 4 వేల రూపాయలతో ముగించేసింది. అయితే ఈ విధానంలో తొలి సారే విజయవంతం కావడం విశేషం. సాధారణంగా ఈ పద్ధతిలో 5 నుంచి 30 శాతం మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
వీర్యం ఎక్కడి నుంచి వచ్చింది..
మగతోడు వద్దు కానీ పిల్లలు కావాలి బాగానే ఉంది.. మరి వీర్యం ఎక్కడి నుంచి వస్తుంది. ఇందుకోసం బెయిలీ ఓ ఆలోచన చేసింది. పూర్తి ఆరోగ్యంతో ఉన్న ఓ స్పెర్మ్ దాతను సెలక్ట్ చేసుకుంది. తొలుత అతనితో వాట్సాప్‌లో చాట్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకుంది. అనంతరం డోనార్ ఇచ్చిన శుక్రకణాలను కిట్ సహాయంతో గర్భాశయంలోకి పంపించుకుంది. ఈ ప్రక్రియ మొత్తంలో స్టెరైల్ కప్స్, సిరంజిలు, ఓవిలేషన్ టెస్ట్‌లు మాత్రమే ఉపయోగించినట్లు ఆమె తెలిపింది.
నోట్: ఎక్కడో అమెరికాకు చెందిన మహిళ సొంతంగా ఈ విధానంలో సక్సెస్ అయ్యింది కదా అని. ఎవరు పడితే వారు ప్రయత్నించడం ప్రమాదకరం. ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఇలాంటి ప్రయోగాలు ఎప్పటికీ మంచివి కావు. గర్భదారణ విషయంలో వైద్యుల సలహాలు తీసుకొని, వారి ఆధ్వర్యంలో చికిత్స తీసుకోవడమే అన్నింటా క్షేమమనే విషయాన్ని మర్చిపోకండి.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..