Watch Video: తెలుగు పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన ఆఫ్రికా పిల్లలు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే..

ఒకప్పుడు జయం సినిమాలోని 'రాను రానంటూనే చిన్నదో' అనే పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఇదే పాటను హీరో నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలో రీమిక్స్ చేసి వదిలారు.

Watch Video: తెలుగు పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన ఆఫ్రికా పిల్లలు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే..
Africans Boys Dance
Follow us
Venkata Chari

|

Updated on: Sep 29, 2022 | 6:35 AM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ప్రపంచం అంతా చిన్నదైపోయింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లోనే మన ముందుంటుంది. ఈ క్రమంలో విచిత్రంగా కొనిపించే కొన్ని వీడియోలు నెట్టింట్లో తెగ సందడి చేస్తుంటాయి. ఇక ప్రత్యేకంగా పాటల గురించి చెప్పాలంటే మాత్రం.. ఎప్పుడు ఏ భాషకు చెందిన పాట వైరల్ అవుతుందో అస్సలు చెప్పలేం. ఇలాంటిదే ఓ పాట నెట్టింటిని ప్రస్తుతం షేక్ చేస్తోంది. అందులోనూ ఆఫ్రికన్ పిల్లలు మన తెలుగు పాటకు జబర్దస్త్ డ్యాన్స్ చేయడంతో, ఈ వీడియో ఎనలేని ప్రేమను పొందుతోంది.

ఒకప్పుడు జయం సినిమాలోని ‘రాను రానంటూనే చిన్నదో’ అనే పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఇదే పాటను హీరో నితిన్ నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలో రీమిక్స్ చేసి వదిలారు. దీంతో ఈ పాటపై పెద్ద ఎత్తున రీల్స్, వీడియోలు నెట్టింట్లో విడుదల అవుతున్నాయి. ఇదే క్రమంలో ఈ ఆఫ్రికన్ పిల్లలు కూడా తెగ డ్యాన్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను మసాకా కిడ్స్ ఆఫ్రికానా అనే ఎన్జీవో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ముగ్గురు పిల్లలు ‘రాను రానంటూనే చిన్నదో’ అంటూ డ్యాన్స్ చేసి, ఆకట్టుకున్నారు. వీరిని వెనుకున్న పిల్లలు కూడా అనుకరిస్తుండడం వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతానికి ఈ వీడియో 9.9 మిలియన్లకు పైగా వ్యూస్‌తో సోషల్ మీడియాలో దూసుకపోతోంది.