ఏం ధైర్యం సామి మీది.. ఏకంగా చిరుత ఆహారాన్నే లాక్కెళ్లిపోయారు.. వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే
పులులు, చిరుతలు, సింహాలు వీటి పేరు చెబితే చాలు.. భయంతో వణికిపోతాం. ఎందుకంటే అవి దాడి చేస్తే ఎంతటి బలమైన జీవి అయినా తోక ముడవాల్సిందే. వాటి చేతికి చిక్కామంటే బతుకుపై ఆశలు వదులుకోవాల్సిందే. ఆహారాన్ని..
పులులు, చిరుతలు, సింహాలు వీటి పేరు చెబితే చాలు.. భయంతో వణికిపోతాం. ఎందుకంటే అవి దాడి చేస్తే ఎంతటి బలమైన జీవి అయినా తోక ముడవాల్సిందే. వాటి చేతికి చిక్కామంటే బతుకుపై ఆశలు వదులుకోవాల్సిందే. ఆహారాన్ని సంపాదించుకునే సమయంలో అవి వేటాడే తీరును చూస్తే ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. వీటిలో కొన్ని భయంగా ఉంటే మరికొన్ని మాత్రం ఆశ్చర్యంగా అనిపిస్తాయి. సాధారణంగా చీతాలు ఎంత ప్రమాదకరమో మనకు తెలిసిందే. వేటాడే విధానం, పరుగులో వాటికి ఏ జంతువూ పోటీ రాలేదు. ఎరపై దాడి చేశాయంటే దానిని చంపి, మాంసాన్ని పీక్కుతినేంత వరకు విడిచిపెట్టవు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంతో కష్టపడి వేటాడిని చిరుతలకు ఇద్దరు వ్యక్తులు ఊహించని షాక్ ఇచ్చారు. చిరుత వేటాడిని ఆహారాన్ని దాని నుంచి లాక్కుని వెళ్లిపోయారు. వారిని అడ్డుకునేందుకు చిరుతలు ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో ఇద్దరు వ్యక్తులు వేటాడిన జింకలను క్రూర మృగాలైన చిరుతల నుంచి లాక్కుంటారు. ఆఫ్రికాలోని టాంజానియాలో నివసిస్తున్న మసాయి తెగకు చెందిన ఇద్దరు వ్యక్తులు చిరుతల వద్దకు వచ్చారు. కేవలం ఒక కర్రను మాత్రమే ఆయుధంగా చూపించి, ఆహారాన్ని లాక్కున్నారు. అయితే ఆ రెండు చిరుతలు కూడా వారిని ఏమీ చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వారి వద్ద నుంచి జింకను తిరిగి తీసుకునేందుకు చిరుతలు వెంటపడినప్పటికీ వాటికి ఆహారం దక్కలేదు. దీంతో నిస్సహాయ స్థితిలో అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేస్తూ.. ‘ఇద్దరు వ్యక్తులు కర్రను చూపించి చిరుతల ఆహారాన్ని దొంగిలించారు. అలా చేసే ధైర్యం మీకు ఉందా?’ అని క్యాప్షన్ ఇచ్చారు. కొన్ని గంటల క్రితమే అప్‌లోడ్ చేసిన ఈ క్లిప్‌ను ఇప్పటివరకు 16 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అదే సమయంలో, వీడియోను చూసిన తర్వాత, వినియోగదారులు తమ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో రాస్తున్నారు. ‘చిరుతలు ఆకలితో లేవు, కాబట్టి అవి దాడి చేసి ఉండవు’ అని, ‘వీరు మాసాయి తెగ ప్రజలు. వారు చాలా ధైర్యవంతులు’ అని వ్యఖ్యానిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..