AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dandiya: నవరాత్రి ఉత్సవాలను ఎంజాయ్ చేస్తోన్న యువతీయువకులు.. స్విమ్మింగ్ ఫూల్ లో దాండియా వీడియో హల్ చల్

ప్రజలు వేదికపై లేదా బహిరంగ మైదానంలో పండుగను ఆస్వాదించడం మనం ఇప్పటి వరకూ చూశాము. అయితే సాంప్రదాయ పద్ధతికి చెక్ పెడుతూ.. దాండియా స్విమ్మింగ్ పూల్‌లోకి ప్రవేశించింది.

Dandiya: నవరాత్రి ఉత్సవాలను ఎంజాయ్ చేస్తోన్న యువతీయువకులు.. స్విమ్మింగ్ ఫూల్ లో దాండియా వీడియో హల్ చల్
Dandiya In A Swimming Pool
Surya Kala
|

Updated on: Oct 03, 2022 | 12:58 PM

Share

దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఉత్సవాల ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఉత్సవాల్లో సందడి చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఎంతో ఉత్సాహంతో నవరాత్రులను ఆస్వాదిస్తున్నారు. సాంప్రదాయ రీతులలో అమ్మవారిని పూజిస్తారు. దాండియా, గర్బాను ప్రదర్శించే పురాతన సంప్రదాయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.  తాజాగా దాండియా ను కొంతమంది యువతీ యువకులు స్విమ్మింగ్ ఫుల్ లో ఆడుతున్న వీడియో వైరల్ అవుతోంది.

ఆధునిక హౌసింగ్ సొసైటీలు, ప్రొఫెషనల్ ఈవెంట్ నిర్వాహకులు పండుగ సందర్భంగా మెగా డ్యాన్స్ ఈవెంట్‌లను నిర్వహిస్తారు. సాంప్రదాయ నృత్యానికి కొంత వినోదాన్ని జోడించాలనే లక్ష్యంతో.. నృత్య ప్రదర్శనతో కొన్ని ప్రయోగాలు చేస్తారు. గుజరాత్‌లోని సూరత్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో కొంతమంది వ్యక్తులు దాండియా ఆడుతున్నట్లు కనిపించే ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది నిజంగా ప్రత్యేకమైనది. ఎందుకంటే ప్రజలు వేదికపై లేదా బహిరంగ మైదానంలో పండుగను ఆస్వాదించడం మనం ఇప్పటి వరకూ చూశాము. అయితే సాంప్రదాయ పద్ధతికి చెక్ పెడుతూ.. దాండియా స్విమ్మింగ్ పూల్‌లోకి ప్రవేశించింది.

ఇవి కూడా చదవండి

నవరాత్రుల్లో 8వ రోజుని దుర్గాష్టమిగా జరుపుకుంటారు. దుర్గామాత,  మహాగౌరీని ఎనిమిదవ రోజు పూజిస్తారు.  పురాణాల కథల ప్రకారం, శివుడిని భర్తగా పొందేందుకు పార్వతీ దేవి తపస్సు చేసింది. ఆ సమయంలో పార్వతి దేవి.. అడవిలో నిదురించింది. ఆకులపై నిద్రించింది. శివయ్యను భర్తగా పొందడం కోసం అనేక సంవత్సరాలు.. అనేక పరీక్షలను ఎదుర్కొంది. శివుడు. పార్వతి తపస్సును మెచ్చి.. తన భార్యగా అంగీకరించాడు. అప్పుడు శివయ్య పార్వతి దేవిని గంగానదిలోని నీటితో స్నానం చేయించాడు. అప్పుడు పార్వతి దేవి రంగును మారింది. అందుకనే పార్వతి దేవిని..  మహాగౌరి అని కూడా పిలుస్తారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వణికిస్తున్న వరుస మరణాలు.. పురోహితుడి సూచన మేరకు ఊరంతా ఖాళీ!
వణికిస్తున్న వరుస మరణాలు.. పురోహితుడి సూచన మేరకు ఊరంతా ఖాళీ!
అలర్ట్‌..ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారా?
అలర్ట్‌..ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారా?
మీ జీవితాన్ని మార్చే 5 జపనీస్ సూత్రాలు.. పాటిస్తే విజయం మీ సొంతం
మీ జీవితాన్ని మార్చే 5 జపనీస్ సూత్రాలు.. పాటిస్తే విజయం మీ సొంతం
ప్రతిరోజూ చెవులు శుభ్రం చేస్తున్నారా? మీరు ప్రమాదంలో పడ్డట్లే!
ప్రతిరోజూ చెవులు శుభ్రం చేస్తున్నారా? మీరు ప్రమాదంలో పడ్డట్లే!
యాక్టింగ్‏కు గుడ్ బై చెప్పేస్తారా.. ? నిహారిక ఆన్సర్ ఇదే..
యాక్టింగ్‏కు గుడ్ బై చెప్పేస్తారా.. ? నిహారిక ఆన్సర్ ఇదే..
తొలి ఓటమితో ఆ ఇద్దరికి షాక్.. చెన్నై ప్లేయింగ్ 11 ఇదే..?
తొలి ఓటమితో ఆ ఇద్దరికి షాక్.. చెన్నై ప్లేయింగ్ 11 ఇదే..?
10 నిమిషాల్లో ఫ్రిజ్ బ్యాడ్ స్మెల్ మాయం.. ఇంట్లోని వస్తువులతో..
10 నిమిషాల్లో ఫ్రిజ్ బ్యాడ్ స్మెల్ మాయం.. ఇంట్లోని వస్తువులతో..
మిమ్మల్ని త్వరగా వృద్ధులను చేసే 5 ప్రమాదకరమైన అలవాట్లు ఇవే!
మిమ్మల్ని త్వరగా వృద్ధులను చేసే 5 ప్రమాదకరమైన అలవాట్లు ఇవే!
నేను దేవుడిని నమ్మను.. కానీ అది నా తల్లి కోరిక..
నేను దేవుడిని నమ్మను.. కానీ అది నా తల్లి కోరిక..
కారం, మసాలా లేనిదే ముద్ద దిగడం లేదా..? ఈ తిప్పలు తప్పవంట..
కారం, మసాలా లేనిదే ముద్ద దిగడం లేదా..? ఈ తిప్పలు తప్పవంట..