Video Viral: అమాంతం ఒడిలో కూర్చుని.. టూరిస్ట్ మహిళకు ముద్దులు పెట్టిన చింపాంజీ..

జంతువులకు సంబంధించిన వీడియోలు తరచుగా ఇంటర్నెట్‌లో (Internet) వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం చింపాంజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చింపాంజీలకు, మనుషులకు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయన్న విషయం మనకు...

Video Viral: అమాంతం ఒడిలో కూర్చుని.. టూరిస్ట్ మహిళకు ముద్దులు పెట్టిన చింపాంజీ..
Chimpanzee Kissing Video
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 23, 2022 | 7:45 AM

జంతువులకు సంబంధించిన వీడియోలు తరచుగా ఇంటర్నెట్‌లో (Internet) వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం చింపాంజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చింపాంజీలకు, మనుషులకు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. వాటిలోని జన్యువులు మానవ జన్యువులు దాదాపు ఒకే రకంగా ఉంటాయి. అంతే కాకుండా ఆదిమానవులు కోతి నుంచే వచ్చారని సైన్స్ చెబుతోంది. దీంతో చింపాంజీలు, కోతులకు చెందిన వీడియోలు, అవి చేసే చిలిపి అల్లరి పనులు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్లిప్‌లో ఒరంగుటాన్ ఓ మహిళను ప్రేమగా ముద్దు పెట్టుకోవడం చూడవచ్చు. ఆసక్తికరమైన విషయమేంటంటే ఒరాంగుటాన్ ను ఆ మహిళ అడ్డుకోవడం లేదు. నన్ను నమ్మండి, ఈ వీడియో మీ రోజును మెరుగుపరుస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత జంతువుల్లోనూ మనుషులకు సమానమైన భావోద్వేగాలు ఉంటాయనే విషయం మనకు అర్థమవుతుంది. వైరల్ అవుతున్న వీడియోలో జూను సందర్శించడానికి ఓ మహిళ వచ్చింది. అక్కడే ఉన్న చింపాంజీ ఆమె వద్దకు వెళ్లి ఏకంగా ముద్దు పెట్టేసింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక పర్యాటకులు ఆశ్చర్యపోయారు. చింపాంజీ మహిళను ముద్దుపెట్టుకుంటున్న ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో monkey.reelz ఖాతాతో పోస్ట్ అయింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by @monkey.reelz

ఈ వీడియోను చూసేందుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటి వరకు 14న్నర వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. అంతే కాకుండా ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. వీడియో చూసిన తర్వాత చాలా మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ‘ఇది చాలా అందంగా ఉంది’ అని, ఇలా మంకీపాక్స్ వ్యాప్తి చెందుతోందని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో ఇంటర్నెట్ లో తెగ హల్ చల్ చేసేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..