AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నవ్వీ నవ్వీ పొట్ట చెక్కలయితే నాకు తెల్వదు… రీల్స్‌ కోసం ఎలా వస్తాయిరా బాబు ఇలాంటి ఐడియాలు

ఇప్పుడంతా సోషల్‌ మీడియా యుగం నడుస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చాక అంతా సోషల్‌ మీడియాలో మునిగి తేలుతున్నారు. రకరకాల రీల్స్‌ చేస్తూ అప్‌లోడ్‌ చేస్తున్నారు. రాత్రికి రాత్రి ఫేమస్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఫేమస్‌ అయ్యేందుకు ప్రమాదకర స్టంట్స్‌ వేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న...

Viral Video: నవ్వీ నవ్వీ పొట్ట చెక్కలయితే నాకు తెల్వదు... రీల్స్‌ కోసం ఎలా వస్తాయిరా బాబు ఇలాంటి ఐడియాలు
Bus Passenger
K Sammaiah
|

Updated on: Sep 25, 2025 | 5:12 PM

Share

ఇప్పుడంతా సోషల్‌ మీడియా యుగం నడుస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చాక అంతా సోషల్‌ మీడియాలో మునిగి తేలుతున్నారు. రకరకాల రీల్స్‌ చేస్తూ అప్‌లోడ్‌ చేస్తున్నారు. రాత్రికి రాత్రి ఫేమస్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఫేమస్‌ అయ్యేందుకు ప్రమాదకర స్టంట్స్‌ వేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. మరికొందరు చేసే ఫన్నీ రీల్స్‌, వీడియోలు త్వరగా వైరల్‌ అవుతుంటాయి. అలాంటి ఫన్నీ వీడియోనే ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తం రోడ్డు పక్కన నిల్చుని ఉన్నాడు. అతడి పక్కన ఏదో బరువైన సంచి ఉంది. దూరం నుంచి ప్రయాణికుల బస్పు రావడం వీడియోలో కనిపిస్తుంది. ఆ వ్యక్తి బస్సును ఆపమని తన చేతితో సైగ చేస్తున్నట్లు కనిపిస్తాడు. బస్సు అతడి వద్దకు రాగానే ఆగిపోతుంది. ఈ క్రమంలో ఎవరైనా ఊహించేది ఒక్కటే. ఆ బస్సులో ఆవ్యక్తి వెళ్లిపోతాడని. కానీ, ఇక్కడ జరిగిన సీన్‌ మాత్రం రివర్స్‌ ఉంది. ఇక్కడే జరిగింది అసలు ట్విస్ట్‌. ఆ వ్యక్తి చేసిన పనిని చూసిన నెటిజన్స్‌ షాక్‌ అవుతున్నారు. అంతలోనే తేరుకుని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు.

వీడియో చూడండి:

బస్సు ఆగగానే ఆ వ్యక్తి లోపలి నుంచి ఒకరిని పిలుస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందులో నుంచి ఒక ప్రయాణికుడితో పాటు బస్సు హెల్పర్‌ కూడా దిగుతాడు. బస్సు హెల్పర్‌ ఆ సంచిని బస్సులోకి ఎక్కించేందుకు క్యారేజ్‌ డోర్‌ తెరుస్తాడు. మరో ప్రయాణికుడు ఆ సంచిని బస్సు ఆపిన వ్యక్తి నెత్తిమీదికి ఎత్తుతాడు. సంచిని ఎత్తుకున్న వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోవడం కనిపిస్తుంది. ఆ సంఘటన చూసిన బస్సు హెల్పర్‌, సంచి ఎత్తిన ప్రయాణికుడు ఇద్దరు షాక్‌ అవుతారు. వార్నీ బస్సును ఆపింది ఇందుకా అనే రేంజ్‌లో ఫేజ్‌ పెడతారు.

ఈ వీడియోను చూసిన నెటిజన్స్‌ రకరకాలుగా ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. రీల్స్‌ కోసమే ఇదంతా చేసినట్లుగా మరికొంత మంది సోషల్‌ మీడియా యూజర్స్‌ పోస్టులు పెడుతున్నారు.