Viral Video: పెంపుడు కుక్క అంటే ఎంత ప్రేమో.. ఈ చిన్నారి చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు..
Viral Video: పెంపుడు జంతువులను ఇష్టపడని వారు ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు. కొందరైతే కుటుంబ సభ్యులతో సమానంగా పెంపుడు జంతువులను ప్రేమిస్తుంటారు. వాటికి దగ్గరుండి అన్ని పనులు చేస్తుంటారు. బయటకు వెళ్లినా సరే వాటిని...
Viral Video: పెంపుడు జంతువులను ఇష్టపడని వారు ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు. కొందరైతే కుటుంబ సభ్యులతో సమానంగా పెంపుడు జంతువులను ప్రేమిస్తుంటారు. వాటికి దగ్గరుండి అన్ని పనులు చేస్తుంటారు. బయటకు వెళ్లినా సరే వాటిని వెంటే తీసుకెళ్తుంటారు. అయితే ఇవన్నీ కాస్త పెద్దవారు చేసే పనులు. ఇక చిన్నారుల గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. పెంపుడు జంతువులపై వారు చూపే ప్రేమ. చూసే వారిని కూడా ఫిదా చేస్తుంటుంది. తెలిసీ తెలియక వారు చేసే పనులు ఇతరులను ఆట్టుకుంటాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో పెంపుడు శునకంపై ఓ చిన్నారి చూపించిన ప్రేమకు అద్దం పడుతోంది. వివరాల్లోకి వెళితే.. ఓ చిన్నారి ఇంట్లో ఉన్న మేకప్ బాక్స్ తీసుకొని ముఖానికి మేకప్ వేసుకుంటుంది. ఈ సమయంలోనే తల్లి చిన్నారిని మేకప్ ఎందుకు వేసుకుంటున్నావు అని అడిగింది. దానికి బదులిచ్చిన ఆ చిన్నారి.. నేను నా డాగ్ ఫ్రాన్సిస్కోలాగా కనిపించడానికి మేకప్ వేసుకుంటున్నాను అని ఆన్సర్ ఇచ్చింది.
చిన్నారి తన పెంపుడు శునకాన్ని పోలినట్లు కళ్ల చుట్టూ, ముక్కుపై నలుపు రంగు వేసుకొని అచ్చంగా ఆ శునకంలాగే రడీ అయ్యింది. దీనంతటినీ స్మార్ట్ ఫోన్‌లో చిత్రీకరించిన ఆ చిన్నారి తల్లి.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఏకంగా 19 లక్షలకుపైగా నెటిజన్లు వీడియోను లైక్ చేశారు. ఇక చిన్నారి చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
View this post on Instagram
David Warner: సల్లూభాయ్‌గా మారిపోయిన వార్నర్.. దిశాపటానీతో డ్యాన్స్.. వైరల్‌గా మారిన వీడియో..