Viral Video: పక్షి అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఏం క్రియేటివిటీ గురూ.. వీడియో వైరల్
Artificial Bird Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇలాంటి వీడియోలతో కొందరి టాలెంట్ కూడా బయటకు వస్తుంది.
Artificial Bird Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇలాంటి వీడియోలతో కొందరి టాలెంట్ కూడా బయటకు వస్తుంది. తాజాగా.. ఓ భారీ పక్షి వీడియో వైరల్ అవుతోంది. వాస్తవానికి ఇది కాగితంతో తయారు చేసిన ఆవిష్కరణ. సాధారణంగా భూమ్మీద పుట్టిన ప్రతి పక్షి తన రెక్కలతో ఆకాశమంతా విహరిస్తుంది. తాజాగా.. కాగితంతో చేసిన ప్రాణంలేని పక్షి కూడా ఆకాశంలో విహరిస్తోంది. నెట్టింట (Social Media) ఈ షాకింగ్ వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. ఇద్దరు వ్యక్తులు కాగితంతో చేసిన పక్షిని ఆకాశంలో విహరించేలా చేశఆరు. ప్రాణం లేని ఈ పక్షి తన రెక్కలతో ఆకాశంలో విహరిస్తూ సందడి చేసింది. వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు వ్యక్తులు కాగితంతో చేసిన పక్షిని పట్టుకోని ఉండటాన్ని మీరు చూడవచ్చు. ఇలాంటి పరిస్థితిలో పక్షిని పట్టుకున్న వ్యక్తి దానిని ఒకేసారి గాలిలోకి వదిలేస్తాడు. దీంతో గాలిలో విహరిస్తూ.. పక్షి వలే ముందుకు సాగుతుంది. కానీ భారీ ఆకారంతో ఈ నిర్జీవ పక్షి విమానంలా కనిపిస్తుందంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.
ఈ వీడియోను అమేజింగ్ ఇన్నోవేషన్స్ అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనిని 18వేలకు పైగా వీక్షించగా.. వందలాది మంది ఈ వీడియోను రీట్వీట్ చేశారు. దీనితో పాటు ఈ వీడియోపై పలు కామెంట్లు చేస్తున్నారు. ఈ దృశ్యం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోందంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ పక్షి విమానంలా ఉందని.. అద్భుతం అంటూ ఓ నెటిజన్ పేర్కొనగా.. ఈ పక్షి లోపల ఏదైనా యంత్రం ఉందని భావిస్తున్నట్లు మరొకరు పేర్కొన్నారు.
వైరల్ వీడియో..
Amazing Invention pic.twitter.com/zCMpHmt0Ou
— Amazing Innovations (@AmazingInnovat1) April 5, 2022
Also Read: