Hyderabad: భాగ్యనగరంలో దారుణం.. స్నేహితుడిపై పెట్రోలు పోసి నిప్పంటించిన దుర్మార్గులు..
Hyderabad Crime News: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు కలిసి స్నేహితుడిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. దీంతో ఆ యువకుడికి ఒళ్లంతా కాలి తీవ్ర గాయాలయ్యాయి.
Hyderabad Crime News: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు కలిసి స్నేహితుడిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. దీంతో ఆ యువకుడికి ఒళ్లంతా కాలి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎర్రగడ్డ (Erragadda) మానసిక చికిత్సాలయం ఆవరణలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిల్ (25), మొహ్మద్ (30), ఆజర్(25) ముగ్గురు మిత్రులు. వీరంతా శుక్రవారం సాయంత్రం ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం క్వార్టర్స్ సమీపంలోని మైదానంలో కూర్చున్నారు. ఈ క్రమంలో ఏదో విషయంపై వీరి మధ్య మాట మాట పెరిగింది. ఇది కాస్త ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో మొహమ్మద్, అజర్ కలిసి ఆదిల్ పై పెట్రోలు పోసి నిప్పంటించారు. అనంతరం అక్కడ నుంచి పారిపోయారు.
బాధితుడి ఒంటికి నిప్పంటుకోవడంతో పెద్ద కేకలు వేస్తు పరుగులు తీశాడు. ఇది గమనించిన స్థానికులు, దవాఖాన సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు బాధితుడిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా దవాఖానాకు తరలించారు. వీరి మధ్య పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అసలు ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఆర్ నగర్ ఇన్ స్పెక్టర్ సైదులు తెలిపారు.
-నూర్ మహ్మద్, టీవీ9 ప్రతినిధి, హైదరాబాద్
Also Read: