AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Frauds: తెలంగాణలో బ్యాంక్‌ ఫ్రాడ్స్‌ కలకలం.. వృద్ధురాలికి సహాయం చేస్తానంటూ రూ.45 లక్షలు కాజేసిన బ్యాంకు ఉద్యోగులు!

Bank Frauds: తెలంగాణలో బ్యాంక్‌ ఫ్రాడ్స్‌ కలకలం రేపుతున్నాయి. ఏకంగా బ్యాంకుల సిబ్బందే మోసాలకు పాల్పడటంతో ఖంగుతింటున్నారు ఖాతాదారులు. ముందుగా..

Bank Frauds: తెలంగాణలో బ్యాంక్‌ ఫ్రాడ్స్‌ కలకలం.. వృద్ధురాలికి సహాయం చేస్తానంటూ రూ.45 లక్షలు కాజేసిన బ్యాంకు ఉద్యోగులు!
Subhash Goud
|

Updated on: Apr 09, 2022 | 5:32 AM

Share

Bank Frauds: తెలంగాణలో బ్యాంక్‌ ఫ్రాడ్స్‌ కలకలం రేపుతున్నాయి. ఏకంగా బ్యాంకుల సిబ్బందే మోసాలకు పాల్పడటంతో ఖంగుతింటున్నారు ఖాతాదారులు. ముందుగా స్మూత్‌గా మాట్లాడి నమ్మిస్తున్నారు. ఆ తర్వాత నట్టెట ముంచుతున్నారు కొందరు బ్యాంకు ఉద్యోగులు (Bank Employees). తాజాగా సికింద్రాబాద్ తుకారాం గేట్‌లో SBI బ్యాంక్ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. వృద్ధురాలికి సహాయం చేస్తున్నట్లు నమ్మించి, పలుమార్లు సంతకాలు తీసుకొని ఏకంగా 45 లక్షలు కాజేశాడు. తన ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు గల్లంతు కావడంతో పోలీసులను ఆశ్రయించింది మహిళ. కానీ, పోలీసులు కేసు నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మొత్తం 6 బాండ్‌ల మీద 48 లక్షల లోన్ తీసుకున్నారు బ్యాంక్ సిబ్బంది. అంతేకాదు, ఖాతాదారుల సేవింగ్ అకౌంట్‌లో ఉన్న 2 లక్షల 50 వేలను కూడా కొట్టేశారు. 12 ఏళ్లుగా బ్యాంక్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న శశి ఈ మోసానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. యెనో అప్‌లో ఫోన్ నెంబర్ మార్చి FDలమీద లోన్ తీసుకున్నాడు ఈ కేటుగాడు.

నాలుగు నెలలుగా బాధితురాలికి బ్యాంకు మెసేజ్‌లు రాకపోవడంతో మేనేజర్‌ని నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. హైదరాబాద్‌లో పరిస్థితి ఇలా ఉంటే, నిర్మల్ జిల్లా భైంసా మండలంలో మరో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. బిజ్జురు గ్రామానికి చెందిన ఓ ఖాతాధారుడి నుంచి, బ్యాంక్ సిబ్బంది అంటూ చెక్కుతీసుకొని 3 లక్షల 50 వేలు కాజేశాడు ఓ అపరిచితుడు. దీనిగురించి బాధితుడి భార్యకు వారం తరువాత సమాచారం ఇచ్చింది బ్యాంక్ సిబ్బంది. రెండేళ్ల క్రితం సాయిరెడ్డి భూమి మాటిగేజ్ చేసి, లోన్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన మరణించారు. బీమా కోసం సాయిరెడ్డి చెక్కులు ఇవ్వాలని ఆయన భార్యను అడిగారు అపరిచితులు. చెక్కులు ఇవ్వడంతో 3.50 లక్షలు కాజేశారు. ఈ విషయం తెలిసి లబోదిబోమంటున్నారు బాధితులు.

ఇవి కూడా చదవండి:

Bhadradri Kothagudem: భద్రాది కొత్తగూడెం జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. కాల్పులు జరిపిన పోలీసులు

Bhainsa: బైంసాలో శ్రీరామనవమి శోభాయాత్రకు అనుమతి.. ఆదేశాలిచ్చిన తెలంగాణ హైకోర్టు

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్