AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhainsa: బైంసాలో శ్రీరామనవమి శోభాయాత్రకు అనుమతి.. ఆదేశాలిచ్చిన తెలంగాణ హైకోర్టు

నిర్మల్ జిల్లా బైంసా(Bhainsa) లో శ్రీరామనవమి శోభాయాత్రకు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షరతులతో కూడిన అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. డీజే మ్యూజిక్ పెట్టి ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దన్న హైకోర్టు.. ఉదయం....

Bhainsa: బైంసాలో శ్రీరామనవమి శోభాయాత్రకు అనుమతి.. ఆదేశాలిచ్చిన తెలంగాణ హైకోర్టు
Telangna High Court
Ganesh Mudavath
|

Updated on: Apr 08, 2022 | 9:52 PM

Share

నిర్మల్ జిల్లా బైంసా(Bhainsa) లో శ్రీరామనవమి శోభాయాత్రకు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షరతులతో కూడిన అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. డీజే మ్యూజిక్ పెట్టి ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దన్న హైకోర్టు.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శోభాయాత్ర నిర్వహించుకోవచ్చని తెలిపింది. శోభాయాత్రలో 200 మంది లోపు మాత్రమే పాల్గొనాలని అదేశించింది. ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని, శోభాయాత్రలో ఎలాంటి సంఘటనలు జరిగినా కేసులు నమోదు చేయాలని సూచించింది. 2021 లో జరిగిన గొడవల కేసులో ముద్దాయిగా ఉన్నవారు పోలీస్ స్టేషన్ సమక్షంలో ఉండాలని తెలిపింది. శ్రీరామనవమి(Sri Ramanavami) శోభాయాత్రకు అనుమతి ఇవ్వాలని హిందూ వాహిని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బైంసా టౌన్ నుంచి పురానా బజార్ వరకు యాత్రకు అనుమతి ఇచ్చింది. బైంసాలో గతంలో పలు సమయాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో బైంసాను పోలీసులు అత్యంత సున్నిత ప్రాంతంగా గుర్తించారు. అయితే బైంసాలో శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ విషయమై హిందూ వాహిని సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిగింది.

మరోవైపు.. భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి కళ్యాణాన్ని ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రెండో అయోధ్యగా పేరొందిన ఖమ్మం జిల్లా భద్రాచలంలో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ నెల 10న జరిగే శ్రీరామనవమికి స్వామివారి కల్యాణ ఉత్సవం జరగనుంది. ఏప్రిల్ రెండో తేదీ నుంచి 16వ తేదీ వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సీతారామ కల్యాణమహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read

PBKS vs GT, IPL 2022: గుజరాత్ టార్గెట్ 190.. దుమ్మురేపిన పంజాబ్.. లివింగ్‌స్టోన్, చాహర్ తుఫాన్ బ్యాటింగ్‌

మృణాళిని రవి లేటెస్ట్ ఫోటోస్ వైరల్

White Hair: ఐదు కారణాల వల్ల జుట్టు తెల్లబడుతోంది.. అవేంటో తెలుసుకొని పరిష్కరించుకోండి..!