TRS: టీఆర్‌ఎస్‌లో భగ్గుమన్న విభేదాలు.. ఎమ్మెల్యే వనమా ముందు కన్నీటి పర్యంతమైన చైర్‌పర్సన్‌

కొత్తగూడెం నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మునిసిపల్ చైర్‌పర్సన్ కాపు సీతామహాలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. సొంత పార్టీ నాయకులే తనను అవమానించారని ఆమె ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు..

TRS: టీఆర్‌ఎస్‌లో భగ్గుమన్న విభేదాలు.. ఎమ్మెల్యే వనమా ముందు కన్నీటి పర్యంతమైన చైర్‌పర్సన్‌
Kothagudem Municipal Chairp
Follow us

|

Updated on: Apr 08, 2022 | 9:34 PM

కొత్తగూడెం నియోజకవర్గ టీఆర్‌ఎస్‌(TRS) పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మునిసిపల్ చైర్‌పర్సన్(Kothagudem Municipal Chairperson)కాపు సీతామహాలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. సొంత పార్టీ నాయకులే తనను అవమానించారని ఆమె ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు వద్ద విలపించారు. టీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య విభేదాలకు శుక్రవారం కొత్తగూడెంలో పార్టీ నిర్వహించిన బైక్‌ ర్యాలీ వేదికైంది. తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే వనమా ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. రామవరం వరకు సాగిన ర్యాలీలో సీతామహాలక్ష్మి బైక్‌ను మరో బైక్‌ ఢీకొనడం వివాదానికి దారితీసింది. కావాలనే తన వాహనాన్ని ఢీకొట్టి అవమానపర్చారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

కొంతకాలంగా మునిసిపల్ చైర్‌పర్సన్ సీతామహాలక్ష్మికి, సొంత పార్టీ కౌన్సిలర్లకు మధ్య విబేధాలు ఉన్నాయి. మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ కౌన్సిలర్లు నినాదాలు, వాకౌట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవి ర్యాలీ సందర్భంగా బయటపడ్డాయి.

ర్యాలీలో తనను సొంత పార్టీ వాళ్లే అవమానించారని ఎమ్మెల్యేకు విలపిస్తూ చెప్పారు సీతామహాలక్ష్మి. ఓ కౌన్సిలర్‌ భర్త తాను వెళుతున్న బైక్‌ను పలుమార్లు ఢీకొన్నారని, ఎన్నిసార్లు బతిమాలినా వినలేదన్నారు. బైక్‌ ఢీకొనడంతో ఆమె కింద పడిపోయారు.

తనకు జరిగిన అవమానానికి నిరసనగా హైవేపై ఆమె ధర్నాకు దిగారు. అయితే ఎమ్మెల్యే వనమా జోక్యం చేసుకుని ఆమెను ఓదార్చారు. న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆమె ధర్నా విరమించారు.

ఇవి కూడా చదవండి: Pomegranate Benefits: ఆ వయసులోని మహిళలకు ఇదో బంగారు పండు.. రోజు ఒకటి తింటే చాలు నిత్య యవ్వనమే..

APS RTC: ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త ప్రయోగం.. బస్సుల్లోనే కొరియర్, కార్గో బుకింగ్‌..