AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ్యాచ్ చూసేందుకు మొసలితో స్టేడియానికి వచ్చిన అభిమాని.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..

కొన్ని దేశాల్లో కొందరు వింత మనుషులుంటారు.. వాళ్లు తమ ఇంట్లో కుక్కలు, పిల్లులు పెంచుకున్నట్లు పాములు, మొసళ్లు, చిరుతపులులు లాంటి జంతువులను పెంచుకుంటారు. అదేవిధంగా, ఒక బేస్ బాల్ ప్రేమికుడు మ్యాచ్ చూసేందుకు తన ఇంట్లో పెంచుకుంటున్న తన ప్రియమైన మొసలితో కలిసి స్టేడియం వద్దకు వచ్చాడు.

మ్యాచ్ చూసేందుకు మొసలితో స్టేడియానికి వచ్చిన అభిమాని.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..
Crocodile
Jyothi Gadda
|

Updated on: Oct 02, 2023 | 2:02 PM

Share

మొసళ్లు, పాములు వంటి ప్రమాదకరమైన జంతువులను చూస్తే మనకు భయం కలుగుతుంది. అయితే విదేశాల్లో అలా కాదు, కొన్ని దేశాల్లో కొందరు వింత మనుషులుంటారు.. వాళ్లు తమ ఇంట్లో కుక్కలు, పిల్లులు పెంచుకున్నట్లు పాములు, మొసళ్లు, చిరుతపులులు లాంటి జంతువులను పెంచుకుంటారు. అదేవిధంగా, ఒక బేస్ బాల్ ప్రేమికుడు మ్యాచ్ చూసేందుకు తన ఇంట్లో పెంచుకుంటున్న తన ప్రియమైన మొసలితో కలిసి స్టేడియం వద్దకు వచ్చాడు. దాంతో అతనికి స్టేడియం భద్రతా సిబ్బంది అనుమతి నిరాకరించారు.

పెంపుడు కుక్కలు, పిల్లులను స్టేడియంలోకి తీసుకెళ్లడం మీరు చూసి ఉండవచ్చు. అయితే మొసలితో మ్యాచ్ చూసేందుకు ఎవరైనా రావడం ఎప్పుడైనా చూశారా? ఈ వింత ఘటన అమెరికాలోని ఫిలడెల్ఫియాలో చోటుచేసుకుంది. సెప్టెంబర్ 27న ఫిలడెల్ఫియాలోని ఫిల్లీస్ MLB గేమ్‌కు ఒక అమెరికన్ వ్యక్తి తన ప్రియమైన మొసలితో కలిసి వచ్చాడు. మొసలితో కలిసి స్టేడియం ప్రవేశ ద్వారం దగ్గరకు వచ్చిన తనను సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఒక్కసారిగా హంగామా మొదలైంది. మొసలితో స్టేడియానికి వచ్చిన జోయ్ హెన్నీ బేస్ బాల్ ప్రేమికుడు.

ఇవి కూడా చదవండి

మొసలిని తీసుకుని సిటిజన్ బ్యాంక్ పార్క్ దగ్గరికి వెళ్లాడు. మొసలితో వచ్చిన అతడిని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఈ సమయంలో అతను తన వద్ద పెంచుకుంటున్న వాలీ అనే మొసలి డిప్రెషన్ నుండి బయటపడటానికి చాలా సహాయపడిందని పేర్కొన్నాడు. నేను వ్యాలీకి కూడా టికెట్ కొన్నాను. కానీ సెక్యూరిటీ దీనిపై తనిఖీ చేయడానికి వెళ్లలేదని, అయితే కుక్కలు, గుర్రాలు వంటి సేవా జంతువులను మాత్రమే స్టేడియం లోపలికి అనుమతిస్తామని చెప్పాడు.

వాలీ ఒక ఎమోషనల్ సపోర్ట్ యానిమల్, సేవా జంతువు కాదు, కానీ దాని వెనుక ఉన్న కథ ఎవరికీ తెలియదు. ఇది ఎవరికీ హాని చేయదని, ఇది చాలా మంచి జంతువు అని వారు చెప్పారు. మొసలిని స్టేడియంలోకి తీసుకొచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మొసలిని స్టేడియం వెలుపలికి తీసుకురావాలని సెక్యూరిటీ గార్డును హెన్నీ వేడుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

నెట్టింట లేడీ సూపర్ స్టార్స్ సందడి.. నయనతార, త్రిష ఫోటోషూట్స్..
నెట్టింట లేడీ సూపర్ స్టార్స్ సందడి.. నయనతార, త్రిష ఫోటోషూట్స్..
ఫైనల్ రేసులో ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ నుంచి మాజీ ఛాంపియన్ ఔట్..?
ఫైనల్ రేసులో ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ నుంచి మాజీ ఛాంపియన్ ఔట్..?
ఎవరీ సమ్మక్క-సారలమ్మ..? మేడారం వన దేవతల జాతర చరిత్ర తెలుసా..?
ఎవరీ సమ్మక్క-సారలమ్మ..? మేడారం వన దేవతల జాతర చరిత్ర తెలుసా..?
బంగారం ధరలు.. సంచలనంగా మారిన బాబా వంగా అంచనా!
బంగారం ధరలు.. సంచలనంగా మారిన బాబా వంగా అంచనా!
తక్కువ ధరకే మెడిసిన్స్.. ఈ కేంద్ర ప్రభుత్వ యాప్ గురించి తెలుసా..?
తక్కువ ధరకే మెడిసిన్స్.. ఈ కేంద్ర ప్రభుత్వ యాప్ గురించి తెలుసా..?
. ఈ స్టార్ కమెడియన్ గుండు వెనక కన్నీళ్లు తెప్పించే విషాదం
. ఈ స్టార్ కమెడియన్ గుండు వెనక కన్నీళ్లు తెప్పించే విషాదం
చైనా, పాకిస్థాన్‌కు దడ పుట్టిస్తున్న ప్రధాని మోదీ మాస్టర్‌ ప్లాన్
చైనా, పాకిస్థాన్‌కు దడ పుట్టిస్తున్న ప్రధాని మోదీ మాస్టర్‌ ప్లాన్
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్.. మళ్లీ ధరలు పైకి
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్.. మళ్లీ ధరలు పైకి
పూజా ఆశలన్నీ ఆ హీరో సినిమా పైనే..
పూజా ఆశలన్నీ ఆ హీరో సినిమా పైనే..
స్టార్ హీరో కొడుకు సినిమాతో సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ
స్టార్ హీరో కొడుకు సినిమాతో సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ