Viral Video: లైక్స్ కోసం యువకుడు బైక్ మీద ప్రమాదకరమైన స్టంట్ .. షాకింగ్ వీడియో వైరల్
స్టంట్స్ చేయడం అందరికీ రాదు. ఎందుకంటే ఈ స్టంట్స్ చేయడానికి చాలా సాధన అవసరం. అయితే అప్పుడే ఎలాంటి స్టంట్స్ నైనా చేయవచ్చు. కొందరు వ్యక్తులను భిన్నమైన స్టంట్ వీడియోలతో ఆకట్టుకోవాలని చూస్తూ ఉంటారు. అయితే ఆలోచించకుండా విన్యాసాలు చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు ఈ వీడియో చూడండి, ఒక వ్యక్తి రద్దీగా ఉండే ప్రదేశంలో ఆలోచించకుండా విన్యాసాలు చేయడం ప్రారంభించాడు. దీని తర్వాత ఏమి జరిగిందో చూస్తే మీరందరూ ఆశ్చర్యపోతారు.
చిన్న, పెద్ద.. స్త్రీ, పురుషుడు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని కోరుకుంటారు. అయితే అది అంత సులభం కాదు. శక్తికి మించి కష్టపడి పనిచేయాలి. అప్పుడే ప్రపంచం మిమ్మల్ని గుర్తిస్తుంది. అయితే సక్సెస్ అందుకోవడానికి సమయం ఎక్కువ పడుతుంది. అంత సహనం ఓపిక అందరికి ఉండవు. అప్పుడు కొందరు సక్సెస్ అందుకోవడానికి షార్ట్ కట్ ను ఎంచుకుంటారు. తమను తాము అందుకు అనుగుణంగా మలచుకుంటారు. అయితే కొన్ని స్టంట్ వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇంటర్నెట్‌లో వచ్చిన వెంటనే స్టంట్ వీడియోలు కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిని కొందరు ఇష్టపడతారు కూడా..
అయితే స్టంట్స్ చేయడం అందరికీ రాదు. ఎందుకంటే ఈ స్టంట్స్ చేయడానికి చాలా సాధన అవసరం. అయితే అప్పుడే ఎలాంటి స్టంట్స్ నైనా చేయవచ్చు. కొందరు వ్యక్తులను భిన్నమైన స్టంట్ వీడియోలతో ఆకట్టుకోవాలని చూస్తూ ఉంటారు. అయితే ఆలోచించకుండా విన్యాసాలు చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు ఈ వీడియో చూడండి, ఒక వ్యక్తి రద్దీగా ఉండే ప్రదేశంలో ఆలోచించకుండా విన్యాసాలు చేయడం ప్రారంభించాడు. దీని తర్వాత ఏమి జరిగిందో చూస్తే మీరందరూ ఆశ్చర్యపోతారు.
ఇక్కడ వీడియో చూడండి
View this post on Instagram
వైరల్ అవుతున్న వీడియోలో రద్దీగా ఉండే రహదారిపై ఒక వ్యక్తి బైక్ స్టంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఒక వ్యక్తి స్టంట్ కోసం తన బైక్ నడుపుతూ.. సీట్ మీద నిల్చుని బ్యాలెన్స్ చేస్తూ నడపడానికి ట్రై చేస్తున్నాడు. అయితే కొంత సేపటికి బైక్ నడపడంలో అతని బ్యాలెన్స్ తప్పిపోయింది. దీంతో ఆ యువకుడు బైక్ మీద నుంచి పడి కొంత దూరం దొర్లుకుంటూ వెళ్ళిపోయాడు. వీడియోను చూస్తుంటే యువకుడి పడిన తీరును బట్టి అతడికి తీవ్రగాయాలు అయ్యి ఉంటాయని ఊహించవచ్చు. ఆ యువకుడు చేసిన విన్యాసంతో తనకు తానే హానిని కలిగించుకోవడమే కాదు ఎదురుగా వస్తున్న బైకర్ కూడా కిందపడేలా చేశాడు.
ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా పేరు kannu_40p ద్వారా షేర్ చేశాడు. ఇప్పటికే రెండు లక్షల మందికి పైగా లైక్ చేశారు. అంతేకాదు ఆ కుర్రాడి మూర్ఖత్వాన్ని చూసి నవ్వుకుంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..