Watch: రెండు లక్షల విలువైన గోల్డ్ మంగళసూత్రాన్ని తినేసిన గేదె.. తర్వాత ఏమి జరిగిందంటే..
సారసి గ్రామానికి చెందిన రైతు రాంహరి భార్య తన మంగళసూత్రాన్ని తీసి ప్లేట్‌లో పెట్టి స్నానానికి వెళ్లింది. స్నానం చేసిన అనంతరం మంగళసూత్రాన్ని తిరిగి ధరించడం మరచిపోయి ఇంటి పనులు చేసుకోవడంలో మునిగిపోయింది. అయితే గంటన్నర తర్వాత తన మెడలో మంగళసూత్రం కనిపించడం లేదని గుర్తించింది రాంహరి భార్య.
మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని సారసి గ్రామంలో, ఒక గేదె తన యజమానురాలి బంగారు మంగళసూత్రాన్ని మేతగా భావించి తినేసింది. ఈ విషయం గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే పశు వైద్యుడికి సమాచారం అందించారు. అనంతరం పశువైద్యుడు ఆపరేషన్ చేసి గేదె కడుపులో ఉన్న మంగళసూత్రాన్ని బయటకు తీశాడు. మంగళసూత్రం తులంన్నర బరువు ఉంది. అంటే ప్రస్తుతం దీని విలువ సుమారు రెండు లక్షల రూపాయలు.
సారసి గ్రామానికి చెందిన రైతు రాంహరి భార్య తన మంగళసూత్రాన్ని తీసి ప్లేట్‌లో పెట్టి స్నానానికి వెళ్లింది. స్నానం చేసిన అనంతరం మంగళసూత్రాన్ని తిరిగి ధరించడం మరచిపోయి ఇంటి పనులు చేసుకోవడంలో మునిగిపోయింది. అయితే గంటన్నర తర్వాత తన మెడలో మంగళసూత్రం కనిపించడం లేదని గుర్తించింది రాంహరి భార్య.
#WATCH महाराष्ट्र:वाशिम ज़िले के एक गांव में भैंस के द्वारा सोने का मंगलसूत्र खाने की घटना सामने आई है। ऑपरेशन से 25 ग्राम का मंगलसूत्र निकाला गया।
पशु चिकित्सा अधिकारी बालासाहेब कौंदाने ने बताया, " मेटल डिटेक्टर से पता चला कि भैंस के पेट में कोई धातु है। 2 घंटे ऑपरेशन चला,… pic.twitter.com/AlM8cpamMc
— ANI_HindiNews (@AHindinews) October 1, 2023
ప్లేట్‌లో లేని మంగళసూత్రం
స్నానం చేసే ముందు ప్లేట్‌లో మంగళసూత్రం తాడుని పెట్టినట్లు గుర్తు చేసుకున్న ఆ మహిళ గబగబా అక్కడికి చేరుకుంది. అక్కడికి వెళ్లి చూసేసరికి ప్లేట్‌లో మంగళసూత్రం కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల వెదికింది. అయినా ఎక్కడా తన మంగళసూత్రం ఆమెకు కనిపించలేదు. ఇంట్లో ఎంత వెతికినా మంగళసూత్రం దొరకలేదు. ఈ విషయాన్ని ఇంట్లోని ఇతర సభ్యులకు చెప్పింది. దీంతో మంగళసూత్రాన్ని ఎవరైనా దొంగలించారా అని ఆలోచించారు. ఇంటి సభ్యుల్లో ఆందోళన మొదలైంది.
మంగళసూత్రం తిన్న గేదే
అయితే కొంత సేపటి తర్వాత ఆ మహిళకు తన మంగళసూత్రాన్ని ప్లేట్ లో పెట్టినట్లు గుర్తు తెచ్చుకుంది. అంతేకాదు అక్కడే తమ గేదెను కట్టి ఉందని గుర్తు చేసుకుని.. తన మంగళసూత్రాన్ని గేదె తినేసిందా అనే అనుమానించింది. వెంటనే ఈ విషయాన్ని తన భర్త రాంహరికి చెప్పింది. రాంహరి మొత్తం విషయాన్ని వాషిమ్ గ్రామానికి చెందిన వెటర్నరీ అధికారి బాలాసాహెబ్ కౌండనేకు ఫోన్‌లో వివరించాడు. వెంటనే డాక్టర్ గేదెను వాషిమ్‌కు తీసుకురావాలని సూచించాడు.
గేదెకు ఆపరేషన్
రైతు రాంహరి తన గేదెను తీసుకుని వాషిమ్ పశుసంవర్ధక కార్యాలయానికి చేరుకున్నాడు. వైద్యాధికారి డాక్టర్ బాలాసాహెబ్ కౌండనే మెటల్ డిటెక్టర్ తో గేదె పొట్టను పరిశీలించగా.. కడుపులో ఏదో ఉందని తేలింది. ఆ తర్వాత గేదె కడుపుకు ఆపరేషన్ చేసి.. గేదె కడుపులో నుంచి మంగళసూత్రాన్ని బయటకు తీశాడు. సుమారు రెండున్నర గంటలపాటు కడుపుకి ఆపరేషన్ చేసి 65 కుట్లు వేశారు. ప్రస్తుతం గేదె సురక్షితంగా ఉందని తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..