AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Temple: నిర్మాణంలో ఉన్న రామమందిరం దృశ్యాలు.. 500 ఏళ్ళ పోరాటానికి ఫలితం రామ మందిరం

అయోధ్యలోని రామమందిర నిర్మాణం పూర్తవుతున్న నేపథ్యంలో యాత్రికులు రామయ్య విగ్రహాన్ని దర్శించుకోగలరని అయోధ్య రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుంది.  అయితే ఆలయ ప్రాణ ప్రతిష్ట (పవిత్ర) తేదీ ఇంకా ఖరారు కాలేదని ఆయన చెప్పారు. జనవరి 26, 2024లోపు యాత్రికులు రాముడిని.. బలరాముడిగా దర్శించుకోగలరని మిశ్రా చెప్పారు.

Ayodhya Temple: నిర్మాణంలో ఉన్న రామమందిరం దృశ్యాలు.. 500 ఏళ్ళ పోరాటానికి ఫలితం రామ మందిరం
Ayodhya Temple
Follow us
Surya Kala

|

Updated on: Oct 02, 2023 | 9:56 AM

కోట్లాది మంది హిందువుల కల.. రాములోరి జన్మించిన అయోధ్యలో రామ మందిర నిర్మాణం తీరుతున్న వేళ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు రామ మందిరం చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2014 జనవరిలో రామాలయం ప్రారంభం కానున్నది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా అయోధ్యలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రామ మందిర చిత్రాలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం పంచుకుంది. ఇది 500 సంవత్సరాల పోరాటం.. సంకల్ప ఫలితమని పేర్కొంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రాన్ని X పేజీలో షేర్ చేశారు.

అయోధ్యలోని రామమందిర నిర్మాణం పూర్తవుతున్న నేపథ్యంలో యాత్రికులు రామయ్య విగ్రహాన్ని దర్శించుకోగలరని అయోధ్య రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుంది.  అయితే ఆలయ ప్రాణ ప్రతిష్ట (పవిత్ర) తేదీ ఇంకా ఖరారు కాలేదని ఆయన చెప్పారు. జనవరి 26, 2024లోపు యాత్రికులు రాముడిని.. బలరాముడిగా దర్శించుకోగలరని మిశ్రా చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఆలయాన్ని 12 గంటల పాటు తెరిచి ఉంచితే 70,000 నుంచి 75,000 మంది సులభంగా దర్శనం చేసుకోవచ్చని మిశ్రా చెప్పారు. ఆలయ నిర్మాణానికి ప్రజల నుంచి డబ్బులు, వస్తువులు విరాళాలుగా  వస్తున్నాయని.. రామాలయం నిర్మాణంలో ప్రభుత్వ ప్రమేయం లేదని చెప్పారు. అంతేకాదు రామాలయ నిర్మాణానికి విరాళాల ద్వారా సుమారు రూ.3,500 కోట్లు సేకరించామని తెలిపారు.

అయోధ్య వివాదంపై 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం అయింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, అయోధ్యలో అద్భుతమైన రామ మందిర నిర్మాణానికి సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రం శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. ట్రస్టు పర్యవేక్షణలో ఆలయ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఆలయ గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహం ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 5, 2020న రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తిరుమలలోని వీఐపీ కాటేజీలో అనుకోని అతిథి.. పరుగులు తీసిన జనం..
తిరుమలలోని వీఐపీ కాటేజీలో అనుకోని అతిథి.. పరుగులు తీసిన జనం..
Video: ఇదెక్కడి టెస్ట్ మ్యాచ్ భయ్యా.. 10 ఓవర్లలోనే క్లోజ్..
Video: ఇదెక్కడి టెస్ట్ మ్యాచ్ భయ్యా.. 10 ఓవర్లలోనే క్లోజ్..
ఆ హాలీవుడ్ మూవీ సిరీస్‌లకు ముగింపు.. ఫీల్ అవుతున్న ఫ్యాన్స్‌..
ఆ హాలీవుడ్ మూవీ సిరీస్‌లకు ముగింపు.. ఫీల్ అవుతున్న ఫ్యాన్స్‌..
నిరుద్యోగ యువతకు భలేఛాన్స్.. SRTRI ఉచితశిక్షణకు దరఖాస్తులు ఆహ్వనం
నిరుద్యోగ యువతకు భలేఛాన్స్.. SRTRI ఉచితశిక్షణకు దరఖాస్తులు ఆహ్వనం
సర్వ రోగాలకు దివ్యౌషధం.. షుగర్ ముప్పు నుంచి అధిక బరువు దాకా ..
సర్వ రోగాలకు దివ్యౌషధం.. షుగర్ ముప్పు నుంచి అధిక బరువు దాకా ..
తరచూ ఉల‌వ‌ల‌ను తింటే ఇన్ని లాభాలా..? ఆరోగ్యం రేసుగుర్రమేనట..!
తరచూ ఉల‌వ‌ల‌ను తింటే ఇన్ని లాభాలా..? ఆరోగ్యం రేసుగుర్రమేనట..!
10thలో 557 మార్కులు.. కానీ ఫలితాలకు 5 రోజుల ముందే మృత్యుఒడికి..
10thలో 557 మార్కులు.. కానీ ఫలితాలకు 5 రోజుల ముందే మృత్యుఒడికి..
IPL: పెర్ఫ్యూమ్ షాపులో పని.. రోజుకు 35 డాలర్ల జీతం.. కట్‌చేస్తే
IPL: పెర్ఫ్యూమ్ షాపులో పని.. రోజుకు 35 డాలర్ల జీతం.. కట్‌చేస్తే
మార్కెట్‌ను రూల్ చేస్తున్న టాలీవుడ్‌.. వారు ఎక్కడ వెనుకబడ్డారు.?
మార్కెట్‌ను రూల్ చేస్తున్న టాలీవుడ్‌.. వారు ఎక్కడ వెనుకబడ్డారు.?
ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో 12కోట్లు వసూలు చేశాడు.. చివరకు..
ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో 12కోట్లు వసూలు చేశాడు.. చివరకు..