AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెను ప్రమాదం నుంచి ఎలుకను కాపాడిన కాకి..! మీరే చూడండి

సాధారణంగా కాకి ఎలుకను చూసిందంటే వదలదు. దాన్ని పొడిచి పొడిచి.. తినేస్తుంది. అలాంటిది ఓ కాకి ప్రమాదంలో ఉన్న ఎలుకను కాపాడింది.

Viral Video: పెను ప్రమాదం నుంచి ఎలుకను కాపాడిన కాకి..! మీరే చూడండి
Crow Saves Rat
Ram Naramaneni
|

Updated on: Dec 20, 2021 | 4:16 PM

Share

సాధారణంగా కాకి ఎలుకను చూసిందంటే వదలదు. దాన్ని పొడిచి పొడిచి.. తినేస్తుంది. అలాంటిది ఓ కాకి ప్రమాదంలో ఉన్న ఎలుకను కాపాడింది. ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అదేదో మెయిన్‌ రోడ్డులాగ ఉంది.. అటూ ఇటూ వాహనాలు రద్దీగా తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ రోడ్డు దాటి అవతలి వైపుకు వెళ్లేందుకు రోడ్డుపై పాకుతూ వెళ్తోంది ఓ ఎలుక. వాహనాలేమో ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా వస్తూనే ఉన్నాయి. అవేమీ పట్టించుకోకుండా ఎలుక ముందుకు వెళ్తూనే ఉంది. ఇదంతా గమనించిన ఓ కాకి అక్కడికి వచ్చింది. రోడ్డు దాటుతున్న ఎలుకను వద్దు.. కార్లొస్తున్నాయి.. అన్నట్టుగా దాని తోక పట్టుకొని వెనక్కి లాగుతోంది. అమ్మో ఈ కాకి నన్ను తినేయడానికి వచ్చేందేమో అనుకుని అది ముందుకు వెళ్తూనే ఉంది. ముందుకెళ్తే నుయ్యి వెనక్కెళ్తే గొయ్యి అన్నట్టుంది ఎలుక పరిస్థితి. కానీ అలా జరగలేదు. ఆ కాకి ఎలుకను కార్ల కిందపడి చనిపోకుండా కాపాడింది. ఇందుకు సంబంధించిన వీడియో.. ఇన్‌స్టాగ్రామ్ లోని organik.paylasimlar అకౌంట్‌లో పోస్ట్ చేశారు. డిసెంబర్ 3న పోస్ట్ చేసిన ఈ వీడియోని వీక్షిస్తున్న లక్షల మంది నెటిజన్లు తెగ లైక్‌ చేస్తున్నారు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఈ వీడియో టిక్‌టాక్‌నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ కాకి ఎలుకను కాపాడిందే.. తన ఆహారంగా మార్చుకోవడానికి అని కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

వాచ్ వీడియో

Also Read: యూట్యూబ్‌లో చూస్తూ భార్యకు డెలివరీ.. చివరకు ఊహించని విషాదాంతం

 కట్నం డబ్బుతో వరుడు పరార్‌.. వధువు చేసిన పనితో శుభం కార్డు.. కానీ

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..