Viral: ఓర్నీ ఏకంగా బ్రిడ్జినే ఎత్తుకెళ్లిన దొంగలు..పోలీసులు షాక్‌!

ఎక్కడైనా దొంగతనం జరిగింది అంటే..విలువైన వస్తువులో, నగలు, డబ్బో పోయుంటాయని అంతా భావిస్తారు..కానీ, ఒకదగ్గర మాత్రం దొంగలు చేసిన దోపిడీ తెలిస్తే..షాక్‌ అవ్వాల్సిందే

Viral: ఓర్నీ ఏకంగా బ్రిడ్జినే ఎత్తుకెళ్లిన దొంగలు..పోలీసులు షాక్‌!
Bride Missing
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 17, 2021 | 7:23 PM

ఎక్కడైనా దొంగతనం జరిగింది అంటే..విలువైన వస్తువులో, నగలు, డబ్బో పోయుంటాయని అంతా భావిస్తారు..కానీ, ఒక దగ్గర మాత్రం దొంగలు చేసిన దోపిడీ తెలిస్తే..షాక్‌ అవ్వాల్సిందే. ఎందుకంటే..ఇక్కడ జరిగిన చోరీ మామూలుగా లేదు..ఏకంగా ఓ భారీ వంతెనను ఎత్తుకుపోయారు దొంగలు..! అవునండి.. మీరు విన్నది నిజమే. దొంగలు ఓ బ్రిడ్జీని ఎత్తుకుపోయారు. అదికూడా 58 అడుగుల పొడవైన బ్రిడ్జీని ఎత్తుకుపోయారు. ఇది తెలిసి పోలీసులు కూడా షాక్ అవుతున్నారు.అయితే, ఈ ఘటన జరిగింది మాత్రం మన దేశంలో కాదు..అగ్రరాజ్యం అమెరికాలో.

అమెరికా..పేరుకు తగ్గట్టుగానే అక్కడి దొంగు కూడా మహా ముదుర్లు.. ఒహియా రాష్ట్రం స్మాల్ అక్రాన్ ప్రాంతంలో రాత్రికి రాత్రే… 58 అడుగుల పొడవైన ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిని మాయం చేశారు..ఈస్ట్ ఆక్రోన్‌లోని ఓ కాలువపై పాలీమర్‌తో నిర్మించిన వంతెన ఇది..నవంబరు 3న ఆ వంతెనకు ఉన్న డెక్‌ను కనిపించకపోవటంతో గ్రామస్థులు షాక్‌ అయ్యారు. బహుశా కూలిపోయి ఉంటుందని భావించి..పరిసరాలు పరిశీలించారు… కానీ దాని జాడ కనిపించలేదు.. ఆ తర్వాత అక్కడున్న వంతెన కూడా సడెన్ గా మాయం అయ్యేసరికి గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదుపై పోలీసులు సైతం షాక్ అయ్యారు. బ్రిడ్జ్ కనిపించకపోవటం ఏంటని ప్రశ్నించారు.. హుటాహుటినా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిజంగానే భారీ క్రేన్లతో నిర్మించిన వంతెన మాయం కావటం చూసి.. పోలీసులు కూడా అవాక్కయ్యారు.. 10 అడుగుల వెడల్పు, 6 అడుగుల ఎత్తు, 58 అడుగుల పొడవు ఉండే ఆ వంతెన తొలగించాలంటే.. భారీ క్రేన్లు అవసరమవుతాయి. అటువంటిది దొంగలు గుట్టుచప్పుడు కాకుండా.. ఎలా దాటించారనేది అంతుచిక్కక పోలీసులే తలలు పట్టుకుంటున్నారు.

Also Read:Viral Video: కొబ్బరి కాయల మధ్య దాగుంది.. కూలీలు వెళ్లగానే ఒక్కసారిగా..

 Viral Video: ఈ పాముకు అందంతో పాటు.. సిగ్గు కూడా ఎక్కువేనట..!